తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఖాళీ అవుతున్న సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీదే. రెండోది బీఆర్ఎస్ సభ్యుడు సురేష్‌రెడ్డిది. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ తరపునే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన పదవీ కాలం కూడా.. ఈ ఏడాది జూన్ 16తో ముగియనుంది. అయితే.. ఈ సీటును తిరిగి ఆయనకే ఇవ్వనున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే రాష్ట్రానికి సమాచారం అందించింది.
ఇక, మిగిలిన ఒకే ఒక్కసీటు కోసం భారీ సంఖ్యలో నాయకులు పోటీ పడుతున్నారు. అయితే.. వీరిని సిఫారసు చేస్తున్న పెద్దల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఒక సీటునుకోరుకుంటున్న నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టే.. వీరిని సిఫారసు చేస్తున్న లేదా వెనుకేసుకు వస్తున్న పెద్ద నాయకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవుతున్నా.. ఇప్పటి వరకు ఈ ఒక్కసీటుకు ఎవరు పోటీ చేస్తారన్నది తెలియకపోవడం.. పోటీ తీవ్రంగా ఉండడం గమనార్హం.
ఎవరు ఎవరిని సిఫారసు చేస్తున్నారు?
+ సీఎం రేవంత్ రెడ్డి… వేం నరేందర్‌రెడ్డిని సిఫారసు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
+ వీ. హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్‌లలో ఎవరికైనా అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.
+ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. వంశీచంద్‌రెడ్డిని ఎంపిక చేయాలని కోరుతున్నారట.
+ గతంలోనే తనకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చారని వినయ్‌కుమార్ కోరుతున్నారు. ఈయనను కొందరు సీనియర్లు సిఫార్సు చేస్తున్నారు.
+ ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి కూడా కేంద్ర స్థాయి పెద్దలతో టచ్‌లో ఉన్నారని తెలిసింది. తనకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని.. సో.. ఇప్పుడు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
+ మరోవైపు.. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తరఫున కొందరు ఏఐసీసీకి ఇప్పటికే సిఫారసు చేశారని అంటున్నారు. మొత్తంగా.. ఒక్క సీటు కోసం కాంగ్రెస్‌లో పెద్ద నేతలే అటు – ఇటు అన్నట్టుగా చీలిపోవడం గమనార్హం. మరి చివరకు ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.
This post was last modified on March 3, 2026 7:29 pm
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…