సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో లేదా నాయకుడి మీద వారి అభిమానులు చూపించే ప్రేమ కంటే.. వాళ్లకు యాంటీ అనిపించే హీరో లేదా రాజకీయ నాయకుడి మీద ద్వేషం ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యక్తుల్ని డీగ్రేడ్ చేసేలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం చాలా ఏళ్లుగా చూస్తున్న వ్యవహారమే. ఈ మధ్య అది మరీ శ్రుతి మించి పోతోంది.
ఒక హీరో లేదా రాజకీయ నాయకుడి పుట్టిన రోజు లాంటి సందర్భాలు వచ్చినపుడు ఓ వైపు అభిమానులు తమ ప్రేమను చాటిచెప్పే హ్యాష్ ట్యాగ్స్ పెడితే.. వాటికి పోటీగా యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం ట్రెండుగా మారిపోయింది. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు కోట్లల్లో ట్వీట్స్ వేసి తమ అభిమానాన్ని చాటిన సంగతి తెలిసిందే. ఐతే అదే సమయంలో జగన్ అభిమానులు పవన్ అభిమానులు పెట్టిన హ్యాష్ ట్యాగ్‌ను పోలినట్లున్న #happybirthdaypawalakalyan అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు.
ఒకరిద్దరు సెలబ్రెటీలు సైతం పొరబాటుగా ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేసేయడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. దాన్ని చూపించి యాంటీ ఫ్యాన్స్ కామెడీలు చేశారు. ఐతే సోషల్ మీడియాలో పవన్ జోలికి వస్తే ఆయన అభిమానులు అంత తేలిగ్గా వదలరు. అవతలి వాళ్లు ఇచ్చిందానికి ఎన్నో రెట్లు తిరిగిచ్చేస్తుంటారు. సెప్టెంబరు 2న పవన్‌ను డీగ్రేడ్ చేసే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేసి దాన్నో అచీవ్మెంట్ లాగా జగన్ ఫ్యాన్స్ పెట్టిన ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నారు.
ఇప్పుడు డిసెంబరు 20న జగన్ పుట్టిన రోజున ఆయన అభిమానులు #hbdysjagan అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దాన్ని పోలినట్లే #hbdysjalaga అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు మొదలుపెట్టారు. హీరోయిన్ రాయ్ లక్ష్మీ ఈ హ్యాష్ ట్యాగ్‌తో ఉన్న ట్వీట్‌ను రీట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. పైగా పవన్ పుట్టిన రోజుకు యాంటీ ఫ్యాన్స్ డీగ్రేడింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లతో పోలిస్తే ఐదారు రెట్లు ఎక్కువ ట్వీట్లే వేశారు పవన్ అభిమానులు. పాత స్క్రీన్ షాట్లన్నీ పెట్టి రివెంజ్ ఎలా ఉంది అంటూ అవతలి వాళ్లకు కౌంటర్లు కూడా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates