ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ ఆయన వాలిపోతున్నారు. దేశ విదేశాల్లో ఎక్కడ ఏ చిన్న అవకాశం చిక్కినా ముందుంటున్నారు. సింగపూర్ నుంచి దుబాయ్ వరకు.. ఎక్కడ పెట్టుబడుల సమావేశాలు నిర్వహించినా.. అక్కడకు వెళ్తున్నారు. అవకాశాలను ఒడిసి పట్టుకుని ఏపీకి దూసుకువస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో శుక్రవారం ప్రత్యక్షమైన చంద్రబాబు.. పలు సంస్థలతో ఐటీకి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి ఏఐ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఏపీలో ఉన్న అపార అవకాశాలను ఆయన వారికి వివరించారు. ఇండియన్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఐబీఎం) సహా .. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు.
ఈ క్రమంలో అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ గురించి వివరించారు. అదేవిధంగా విశాఖలో ఏర్పాటు కానున్న డేటా కేంద్రం.. ఐటీ సంస్థల వివరాలను తెలిపారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ క్రమంలో పలు సంస్థలు.. చంద్రబాబు సమక్షంలో ఏపీ అధికారులతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇవీ తాజా ఒప్పందాలు..
+ క్వాంటం – ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ఏడు సంస్థలతో ఒప్పందం.
+ ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఈ సంస్థలు ముందుకు వచ్చాయి.
+ క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అమెరికా సంస్థ ఒప్పందం.
+ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates