తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎవరికి జాతిపితవురా నువ్వు అంటూ కేసీఆర్ పై రేవంత్ చేసిన షాకింగ్ కామెంట్లు కాక రేపాయి. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలకు కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రోకర్ నా…అంటూ బూతులు తిడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మరో రెండు రోజుల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ రోడ్ షో సందర్భంగా కాంగ్రెస్ నేతలతోపాటు సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలతో విరుచుకుపడ్డారు. మీరేమీ పీకలేరు…మీ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ఏమీ చేయలేడు అంటూ విమర్శించారు.
అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకూడదని రేవంత్ రెడ్డి అందరు దేవుళ్లకు మొక్కుకోవాలని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరగానే పొట్టోడికి రేవంత్ ను ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ను పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నవురా అంటూ ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ పోరాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి…చంద్రబాబు కోసం సంచులు మోస్తున్నాడని ఎద్దేవా చేశారు.
సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్…అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. వెనకటి రోజులు తెస్తానని రేవంత్ ముందే చెప్పాడని, అందుకే యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడే వెనుకటి రోజులు వచ్చాయని విమర్శించారు. ఒక్కసారి ఈ కాంగ్రెస్ వాళ్ల మాటలు విని అవకాశమిస్తే ఏం జరిగిందో ప్రజలకు అర్థమైందని అన్నారు. మరి, కేటీఆర్ కామెంట్లకు రేవంత్ ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి.
This post was last modified on February 9, 2026 12:16 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…