Political News

బిగ్ డిబేట్‌: అంబ‌టి మౌనిక పొలిటిక‌ల్ ఎంట్రీ ట్విస్ట్‌… ?

వైసీపీ నేత అంబ‌టి రాంబాబు.. సీఎం చంద్ర‌బాబుపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న జైలుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక‌, అంబ‌టి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ.. టీడీపీ ఎమ్మెల్యే గ‌ళ్లా మాధవి, ఆమె భ‌ర్త రామచంద్ర‌రావు టీడీపీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు. ఈ క్ర‌మంలోనే మీడియా ముందుకు వ‌చ్చిన అంబ‌టి కుమార్తె మౌనిక‌.. ఇటు స‌ర్కారు, అటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు మౌనిక రాజ‌కీయ ఎంట్రీ ఉంటుందా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. ప‌లువురు కాపు నాయ‌కులు కూడా మౌనిక దూకుడును ప్ర‌శంసిస్తున్నారు. వాస్త‌వానికి గ‌తంలోనూ అనేక మంది వార‌సురాళ్లు త‌మ కుటుంబాల‌కు ఇబ్బందులు త‌లెత్తిన‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చారు. భూమా నాగిరెడ్డి కుమార్తెల్లో రెండో కుమార్తె.. మౌనిక కూడా ఇలానే దూకుడు ప్ర‌ద‌ర్శించారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో 2015-17 మ‌ధ్య ఆమె ఫైర్ బ్రాండ్ రాజ‌కీయాలు చేశారు.

దీంతో ఆమెపై కూడా ఇలాంటి చ‌ర్చే జ‌రిగింది. కానీ, మౌనిక రాజ‌కీయ అరంగేట్రం చేయ‌లేదు. నిజానికి అక్క భూమా అఖిల ప్రియ కంటే కూడా మౌనిక‌కే ఎక్కువ‌గా మార్కులు ప‌డ్డాయి. అయిన‌ప్ప‌టికీ.. ఆమె పొలిటిక‌ల్‌గా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేదు. ఇప్పుడు అంబ‌టి కుటుంబం నుంచి మౌనిక వ‌స్తున్నారా?  అంటే.. వైసీపీ నాయ‌కులు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నారు. కానీ, ఈ విష‌యంలో ఆమె ఇప్ప‌టికీ మౌనంగానే ఉన్నారు.

కులం ఒక్క‌టే స‌రిపోతుందా.. ?
ప్ర‌స్తుతం అంబ‌టి కుమార్తెకు ఉన్న ఏకైక ట్యాగ్ కులం మాత్ర‌మే. దీనిని ఆధారంగా చేసుకునే ఆమె వ్యాఖ్యలు చేశారు. అంత మాత్రాన కాపులు మొత్తంగా ఆమెకు మ‌ద్ద‌తు ప‌లుకుతారా? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌. ఇక్కడే ఓ కీల‌క విష‌యం చ‌ర్చించాలి.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుమార్తె క్రాంతి కూడా ఫైర్ కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. కానీ, రాజ‌కీయంగా ఆమె చేస్తున్న వ్యాఖ్య‌లు.. కాపు సామాజిక వ‌ర్గంలో పెద్ద‌గా చ‌ర్చ‌కు రావ‌డం లేదు. అయితే.. జ‌న‌సేన గూటిలో ఉన్నారు కాబ‌ట్టి.. ఆమెకు అదే ర‌క్ష‌ణ‌గా ఉంది. మ‌రి మౌనిక వ్య‌వ‌హారంఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది చూడాలి.

This post was last modified on February 9, 2026 2:55 pm

Share

Recent Posts

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

4 minutes ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

5 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

6 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

7 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

7 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

9 hours ago