తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఉందని వైసీపీ వాదిస్తోంది. అయితే, ఆ వాదనలను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ ల కామెంట్లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలోనే తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని జగన్ ఆరోపించారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 4 నెయ్యి ట్యాంకర్లను టీటీడీ రిజెక్ట్ చేసిందని, ఆ ట్యాంకర్లు మళ్లీ దొడ్డిదారిన తిరుపతికి వచ్చాయని ఆరోపించారు.
ఆ ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని లడ్డూలో వాడారని, ఇదే విషయాన్ని సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొందని జగన్ అన్నారు. చంద్రబాబు చేసిన అన్యాయన్నే సీబీఐ చార్జ్ షీట్ లో పొందుపరిచిందని తెలిపారు. లడ్డూ ప్రసాదంలో గొడ్డు, పంది కొవ్వులు, చేప నూనె కలిశాయని దుష్ప్రచారం చేశారని, రాజకీయాల కోసం దేవుడిని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని సీబీఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉందని, నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ స్పష్టం చేసిందని జగన్ చెప్పారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు.
వేంకటేశ్వర స్వామిని చంద్రబాబు అగౌరవపరిచారని, ప్రసాద ప్రతిష్ఠను దిగజార్చారని జగన్ విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నించిన వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారని ఫైర్ అయ్యారు.
సీబీఐ చార్జిషీట్ లో ఎవరు పాపం చేశారో స్పష్టంగా ఉందని, ఇప్పుడు ఎవరిది తప్పో చంద్రబాబు, లోకేశ్, పవన్ లు చెప్పాలని జగన్ ప్రశ్నించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరూ చెప్పలేదని, తమ స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు,పవన్, లోకేశ్ లు చెప్పారని అన్నారు.
వాళ్లకు డంకా బజాయిస్తున్న కొన్ని మీడియా సంస్థలు అదే విషయంపై దుష్ప్రచారం చేశాయని ఆరోపించారు. ఇంతకన్నా హేయమైన పని ఎక్కడా ఉండదని అన్నారు. సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చంద్రబాబు లెంపలేసుకొని వెంకటేశ్వర స్వామికి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుండా ఇంకా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on February 6, 2026 6:36 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…