Political News

ఏపీలో ఎన్నాళ్లీ లడ్డూ రాజకీయం..!

ఏపీలో తెర మీదకు వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాజకీయం మరింత ముదురుతోంది. ఇవి ఎప్పటి వరకు సాగుతాయి? ఎంత వరకు కొనసాగుతాయి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తెరపైకి వచ్చింది. 2024 జూన్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే ఏడాది సెప్టెంబర్‌లో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

అప్పట్లో సీఎం చంద్రబాబే స్వయంగా లడ్డూ వ్యవహారంపై వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడి నుంచి ప్రారంభమైన విచారణ ఏడాది పాటు కొనసాగింది. గత నెలలో సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను సమర్పించింది. అదే సమయంలో చార్జిషీట్‌ను కూడా దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగాల్సి ఉంది.

ఇంతలోనే లడ్డూపై రాజకీయం మరింత వేడెక్కింది. రెండోసారి ఈ వివాదాన్ని వైసీపీ మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గతంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సీబీఐ నివేదికలో ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు స్పందించారు. జంతువుల కొవ్వు కలిసినట్లు ఎక్కడా నివేదికలో లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూజలు నిర్వహించి నిరసనలు తెలిపారు. దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఈ పరిణామాలతో శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం దాడులు, అరెస్టులు, జైలు వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు ఈ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వం మరోసారి కమిషన్ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సిట్ అధికారులు తేల్చని అంశాలను మళ్లీ పరిశీలించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే కోర్టులో ఉన్న సిట్ నివేదికపై విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వం కొత్త కమిటీ లేదా కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. అన్ని కోణాల్లో పరిశీలిస్తే తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం వచ్చే ఎన్నికల వరకు కొనసాగినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on February 6, 2026 6:34 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

45 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

4 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

7 hours ago