Political News

‘కేసీఆర్ కి ఇంకా అధికార వ్యామోహం పోలేదు’

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు తిర‌స్క‌రించినా.. తిప్పికొట్టినా.. ప‌ద‌వీ వ్యామోహం పోవ‌డంలేదు.. అని దుయ్య‌బ‌ట్టారు. వాస్త‌వానికి సీఎం రేవంత్‌ త‌ర‌చుగా బీఆర్ ఎస్‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా అమెరికా నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన `రావి నారాయ‌ణ‌రెడ్డి స్మార‌క‌` కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ నేతగా రాజిల్లిన రావి నారాయ‌ణ రెడ్డి రాజ‌కీయ జీవితం గురించి ప్ర‌స్తావించారు.

రావి ఔన్న‌త్యాన్ని, ఆద‌ర్శాన్ని మెచ్చుకున్నారు. ఇదేస‌మ‌యంలో ప‌ది మందికీ ఆయ‌న స్ఫూర్తి నిచ్చారో కూడా సీఎం రేవంత్ వివ‌రించారు. ఇక‌, ఇదేస‌మయంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.  “నేటి నేత‌ల‌కు ప‌ద‌వీ వ్యామోహం ఎక్కువ‌. ప్ర‌జ‌లు ఛీత్క‌రించినా.. తిర‌స్క‌రించినా వారు మార‌డం లేదు“ అంటూ కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, రావి త‌న ఆస్తుల‌ను ప్ర‌జ‌ల‌కు పంచార‌న్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వం ప్ర‌జ‌ల ఆస్తులను దోచుకుంద‌ని వ్యాఖ్యానించారు. వంద‌ల ఎక‌రాల భూములు, ఫామ్ హౌస్‌లు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు.

ఇక‌, తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్ త‌న కుటుంబానికే ప‌ద‌వులు ఇచ్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. “ ప్రజల నుంచి తిరస్కారం పొందినా.. కొంద‌రికి పదవీ వ్యామోహం పోవడం లేదు.“ అని దుయ్య‌బ‌ట్టారు. నేరాలు చేసిన వారిని ప్ర‌శ్నించ‌డ‌మే కాకుండా.. చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్య‌వ‌హారంపై రేవంత్ ప‌రోక్షంగా స్పందించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు.. బీఆర్ ఎస్ నాయ‌కులు.. ఎన్ని త‌ప్పులు చేయాలో.. ఎన్ని త‌ప్పుడు ప‌నులు చేయాలో అన్నీ చేశార‌ని వ్యాఖ్యానించారు.  ఇలాంటి వారిని ప్ర‌శ్నించ‌క‌పోతే ఎలా? అని నిల‌దీశారు. “అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు.“ అని తేల్చి చెప్పారు.  

ఎవ‌రీ రావి నారాయ‌ణ రెడ్డి?

రావి నారాయణరెడ్డి కమ్యూనిస్టు నాయకుడు. తెలంగాణ పోరాటంలో ముఖ్యనాయ‌కుడిగా ఎదిగారు. సంఘ సంస్కర్తగా ఉదార ప్రజాస్వామ్యవాదిగా ప్ర‌జ‌ల నుంచి గుర్తింపు పొందారు. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతిక ఉద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా మార్చారు.

తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా రావిని పేర్కొంటారు. యాదాద్రి – భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908, జూన్ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రావి..  1991, సెప్టెంబ‌రు 7న మృతి చెందారు.  1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి, పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.

This post was last modified on February 4, 2026 9:07 pm

Share

Recent Posts

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

41 minutes ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

2 hours ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

2 hours ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

4 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

4 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

6 hours ago