ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇల్లు, ఆఫీసుపై దాడి జరిగింది. అంబటిపై పలు కేసులు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలోనే అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే అంబటికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అంబటిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఏపీలోని పలు ప్రాంతాల్లో అంబటిపై 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో అంబటి దూషణలకు దిగారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.
పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సమాజంలో ఉద్రిక్తతలు పెంచేలా అంబటి తీరు ఉందని ఆరోపించారు.
రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన
అంబటిని బయటకు వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని తెలిపారు.
అంతేకాదు, రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని కలిగే అవకాశముందని పోలీసులు ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంబటిని అరెస్ట్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే అవకాశముందని, అందుకే అరెస్టు చేశామని తెలిపారు. ఆ క్రమంలోనే అంబటికి 14 రోజుల రిమాండ్‌తో పాటు పోలీసు కస్టడీ ఇవ్వాలని నల్లపాడు పోలీసులు కోరారు. ఈ క్రమంలోనే అంబటికి గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
This post was last modified on February 2, 2026 9:07 am
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…