కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేమాట మీద ఉన్నారు. జలజగడాలు వద్దని…చర్చలతో సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు.
మరోపక్క చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కొలువునిచ్చారు. అంతేకాదు, అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని కూడా స్వయంగా చంద్రబాబుకు రేవంత్ అందజేశారు. అయితే, ఆ చంద్రబాబు… ఏపీ సీఎం చంద్రబాబు కాదు. ఇటీవల గ్రూప్-3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఉద్యోగంలో చేరబోతున్న చంద్రబాబు.
గ్రూప్-3లో అర్హత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అనే అభ్యర్థి పేరును వ్యాఖ్యాత పిలవగానే శిల్పకళావేదికలో నవ్వులు పూచాయి.
రేవంత్ తో పాటు వేదిక మీద ఉన్నా నాయకులంతా చిరునవ్వులు చిందించారు. చంద్రబాబు పేరు పెట్టుకున్న ఓ అభ్యర్థికి నియామక పత్రాన్ని చిరునవ్వుతో రేవంత్ అందించారు. ఆ అభ్యర్థి వెన్ను తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దానిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. చంద్రబాబుకు రేవంత్ కొలువు ఇచ్చారని సరదాగా కొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాలను ఒక బాధ్యతతో ఎలాంటి తప్పులు లేకుండా భర్తి చేశామని వెల్లడించారు.
ప్రశ్న పత్రాలను గత ప్రభుత్వం పల్లీ బఠానీల్లా అమ్మిందని, అయినా సరే బీఆర్ఎస్ నేతలకు చీమకుట్టినట్లైనా లేదని ఎద్దేవా చేశారు. యూపీఎస్సీ ని పరిశీలించి టీజీపీఎస్సీ ని ప్రక్షాళన చేశామన్నారు. గ్రూప్-3 నియామక పత్త్రాలు ఇవ్వొద్దని ఎన్నో కుట్రలు చేశారని అన్నారు. అయినా సరే అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. కోర్టులలో కొట్లాడి ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
A surprising moment at the appointment letter event in Hyderabad drew laughs and cheers when a candidate named Chandrababu Naidu was announced.
— Gulte (@GulteOfficial) January 17, 2026
CM Revanth Reddy smiled at the coincidence and personally handed over the appointment letter. pic.twitter.com/N0WCE52KhD
Gulte Telugu Telugu Political and Movie News Updates