వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 21న వైసీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొందరు కార్యకర్తలు, నాయకులు.. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు.
గొర్రెలు, పొట్టేళ్లను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. వికృతంగా తలలు నరికి.. ఆయా మూగజీవాల కళేబరాల నుంచి ఉబికి వచ్చిన రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసి.. పైశాచిక ఆనందం పొందారు.
పైగా.. ఆయా ఘటనలను వీడియోలు, ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పరిణామాలపై స్థానికంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల్లో జంతువుల మాదిరిగా వ్యవహరించారంటూ.. పలువురు స్థానికులు వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
అయినా.. ఆయా ఘటనలను వైసీపీ నాయకులు సమర్థించుకున్నారు. ఇక, పార్టీ కార్యాలయం కానీ, పార్టీ అధినేత జగన్ కానీ.. ఆయా ఘటనలకు సంబంధించి స్పందించలేదు. మరోవైపు.. ఈ వికృత పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది.
మరోవైపు.. జంతు బలులు, రక్తాభిషేకాలు జరిగిన ప్రాంతాల్లోని ప్రజలు కూడా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా మంగళవారం ఉదయం ఆయా ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఘటనలకు బాధ్యులైన ఆరుగురు వైసీపీ నాయకులు, 15 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సమాజాన్ని భయపెట్టడం, సాధారణ ప్రజలను భయకంపితులను చేయడం, జంతు బలుల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
This post was last modified on December 23, 2025 5:04 pm
స్టేజ్ మీద మాట తూలడం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య సినీ ప్రముఖులలో పలువురి విషయంలో ఇదే…
ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది కీలక దశకు చేరుకుంది. పలు పబ్లిక్ ప్లేసుల్లో చేయడంతో వీడియో లీకులు బయటికి వస్తున్నాయి.…
ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచడం కోసం వేరే భాషల నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం ఎప్పట్నుంచో ఉన్నదే. గత కొన్నేళ్లలో…
క్రిస్మస్ పండక్కు వస్తున్న సినిమాల్లో దండోరా అనే చిన్న మూవీ బాగానే సౌండ్ చేస్తోంది. ప్రమోషన్లతో ఆడియన్స్ దృష్టిలో పడ్డ…
సరైన హిట్టు లేక అల్లాడిపోతున్న రణ్వీర్ సింగ్ కు దురంధర్ ఇచ్చిన కిక్కు అంతా ఇంతా కాదు. తనతో పాటు…
అఖండ తాండవం 2 ఫలితం తేలినట్టే ఉంది కానీ ఇంకోవైపు తేలనట్టు కూడా అనిపిస్తోంది. కారణం బుకింగ్స్. రెండో వీక్…