ఆరేళ్లు వెనక్కి వెళ్తే నందమూరి బాలకృష్ణ కెరీర్ దారుణమైన స్థితిలో కనిపించింది. యన్.టి.ఆర్-కథానాయకుడు, యన్.టి.ఆర్-మహానాయకుడు, రూలర్ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కావడంతో బాలయ్య మార్కెట్ బాగా డౌన్ అయింది. ఆ స్థితి నుంచి ఆయన మళ్లీ కోలుకోగలడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ‘అఖండ’, ‘భగవంత్ కేసరి’, ‘వీరసింహారెడ్డి’, ‘డాకు మహారాజ్’.. ఇలా వరుస హిట్లతో బాలయ్య దూసుకెళ్లాడు.
వీటి తర్వాత ‘అఖండ-2’కు మంచి హైప్ వచ్చింది. అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా లేకపోయినా.. బాలయ్య స్థాయినేమీ తగ్గించలేదీ చిత్రం. ‘అఖండ-2’ ఫలితం అభిమానులను కాస్త నిరాశపరిచినా.. బాలయ్య తర్వాతి సినిమా ఒక రేంజిలో ఉండబోతోందనే అంచనాలుండడం వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘యన్.టి.ఆర్’ చిత్రాలకు పని చేసిన సీనియర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు రచయిత కావడం విశేషం. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి గొప్పగా చెప్పాడు.
‘‘అదొక అద్భుతమైన సబ్జెక్ట్. NBK111 అనేది నెక్స్ట్ లెవెల్ సినిమా. రేప్పొద్దున సినిమా రిలీజయ్యాక అందరూ షాకైపోతారు. బాలయ్య బాబు అభిమానులే కాదు.. తటస్థులు, సినిమా అభిమానులందరూ ఆ సినిమా చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఒకసారి సినిమా చూసి ఆగిపోరు. రెండుమూడుసార్లు చూస్తారు. తనతో పాటు కొంతమందిని తీసుకెళ్లి ఆ సినిమా చూపించడాన్ని ఒక గర్వకారణంలా ఫీలవుతారు. ఆ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ గర్విస్తారు’’ అని సాయిమాధవ్ అన్నారు.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారట, రాజుగా కనిపిస్తారట కదా అని అడిగితే.. ఆ విషయం తాను చెప్పకూడదని, దర్శకుడు, ప్రొడక్షన్ టీమే చెప్పాలని సాయిమాధవ్ వ్యాఖ్యానించారు. రామ్ చరణ్‌తో ‘పెద్ది’ చేస్తున్న వృద్ధి సినిమాస్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 23, 2025 11:01 am
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…