అధికార ప్రతినిధులకు సీఎం చంద్రబాబు తాజాగా క్లాస్ అవ్వటం ఆసక్తిగా మారింది. పార్టీలో అధికార ప్రతినిధులుగా ఉన్న కొందరు విషయ పరిజ్ఞానం లేకుండా మీడియా ముందుకు వస్తున్నారు అన్న చర్చ ఆయన తీసుకువచ్చారు. ఏ అంశం పైనైనా మాట్లాడేందుకు అందరూ సాధ్యం కాకపోవచ్చు. ఎవరికైనా విషయపరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇటీవల ఇండిగో వ్యవహారంపై పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రిపబ్లిక్ టీవీలో చర్చనీయాంసంగా మారాయి.
రిపబ్లిక్ టీవీని బహిష్కరిస్తున్నామని బహిరంగంగా ప్రకటించడం కూడా వివాదానికి దారితీసింది. ఇది ప్రత్యర్థి పార్టీలకు అవకాశం కల్పించిందన్న విషయం కూడా చంద్రబాబు ప్రస్తావించారు. వాస్తవానికి మీడియాను చూసే కోణంలో కానీ మీడియాను ఆదరించే విషయంలో కానీ టిడిపి పెట్టింటి పేరు. సహజంగా ఎంతో విభేదం ఉంటే తప్ప మీడియాను బహిష్కరించడం అనేది టిడిపిలో ఎప్పుడు లేదు. 2014-19 మధ్య కూడా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలను మీడియాను కూడా చంద్రబాబు ఆహ్వానించాలని చెప్పారు.
కానీ, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించి ఆ మీడియాను దూరం పెట్టింది. అప్పట్లోనూ చంద్రబాబు ఇదే విషయం చెప్పుకొచ్చారు. అధికార ప్రతినిధులు వాస్తవాలను గుర్తించాలని మీడియా యాజమాన్యాలు ఒక లైన్ తీసుకున్నప్పుడు మీడియా ప్రతినిధులు మాత్రం ఏం చేస్తారని అప్పట్లోనే ఆయన మాట్లాడారు. దీంతో ఎన్నికలకు ముందు 2019 సమయంలో అన్ని మీడియాలను పిలిచి ప్రెస్ మీట్ లు పెట్టారు. మీడియా సంస్థలను ఆదరించారు.
ఇటీవల తరచుగా చంద్రబాబు మీడియా ముందుకు వస్తున్నారు. తద్వారా ప్రజలకు చెరువ కావాలన్నది ఆయన ప్రధాన టార్గెట్ గా ఉంది. అయితే అధికార ప్రతినిధులుగా ఉన్నవారు మీడియా చర్చల్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి. దీనిని గుర్తించిన చంద్రబాబు ఇకపై విషయపరిజ్ఞానం పెంచుకోకుండా మీడియా ముందుకు వెళ్లొద్దని ఆదేశించారు. నిరంతరం పత్రికలు చదవాలని, కేవలం కొన్ని పత్రికలకే పరిమితం కాకుండా అన్ని పత్రికల్లో వస్తున్న వార్తలను కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు.
వ్యతిరేక భావనతో వార్తలు రాశారు అన్న ఉద్దేశాన్ని మనసులోంచి చెడిపేయాలని అందులో ప్రజా కోణం ఉంటే తప్పకుండా ఆయా సమస్యలపై దృష్టి పెట్టాలని కూడా తాజాగా చెప్పారు. తద్వారా అధికార ప్రతినిధులు మరింత పదును పెట్టుకునేలాగా ప్రజల సమస్యలపై మరింత ఎక్కువగా దృష్టి సారించేలా వ్యవహరించాలని కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ పరిణామం పార్టీలో మార్పు తీసుకువస్తుందని అదేవిధంగా బలమైన వాయిస్ వినిపించేలా చేస్తుందని కూడా చంద్రబాబు భావిస్తుండటం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates