తప్పు చేశాడు థర్డ్ డిగ్రీ రుచి చూశాడు

పార్టీ మెప్పు కోసమో.. తమ ప్రాపకం కోసమో.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు తెగ రెచ్చిపోతుంటారు. వేదిక దొరికితే చాలు అడ్డు అదుపు లేకుండా వాగేస్తుంటారు. సోషల్ మీడియా లో విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంటారు. చివరికి ఆపదలో పడ్డప్పుడు ఆదుకునేవారు కరువుతారు. పార్టీ నేతలు ఆ వ్యక్తి వైపు కన్నెత్తి చూడరు. కొన్నేళ్లుగా జరుగుతున్న రాజకీయ ఉచ్చులో ఇటువంటి ఎందరో బలైపోతున్నారు.

నోరు ఉంది కదా అని అనుచిత వ్యాఖ్యలు చేసి చివరకు కటకటాల పాలవుతున్నారు. అటువంటి వారికి బెస్ట్ ఉదాహరణ ఈ బోరుగడ్డ అనిల్. వైసీపీ అనుకూలమైన వ్యక్తిగా ఇతను గుర్తింపు పొందాడు. ఇలాంటివారే అన్ని పార్టీల్లో ఉంటారు.. ఏదో ఒక సమయంలో ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పార్టీ మెప్పుకోసం పోయి చివరకు ఒంటరిగా మిగిలిపోతున్నారు.

కొద్దిరోజుల కిందట బోరుగడ్డ అనిల్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారు అనేది పూస గుచ్చినట్లు వివరించారు. అనిల్ చెప్పిన దానిలో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. గతంలో పోలీసు కస్టడీ నుంచి అతను బయటకు వస్తున్నపుడు నడవలేని స్థితిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు ఒక్క నేత కూడా అతనికి మద్దతుగా నోరు తెరవలేదు. 

ఆ తర్వాత సుదీర్ఘ కాలం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ పాత పద్ధతిలోనే వ్యాఖ్యలు చేయడం.. ఇది గమనించిన వైసీపీ అతను తమ పార్టీ వాడు కాదంటూ తేల్చి చెప్పడం జరిగింది. పార్టీ పెద్దల మెప్పుకోసం పోయిన అనిల్ లాస్ట్ కి ఎటూ కాకుండా పోయాడు. తప్పు చేశాడు.. థర్డ్ డిగ్రీ రుచి చూశాడు అని అంతా లైట్ గా తీసుకునే పరిస్తితి వచ్చింది.

ఈ భయంకర నిజాలు తెలుసుకొని అయిన కొందరు ద్వితీయ శ్రేణి రాజకీయ నాయకులు మారాలి. రాజకీయ స్వార్ధం కోసమో, నాయకుల మెప్పు కోసమో మితిమీరి దూషణలు చేస్తే.. వారే కాదు, వారి కుటుంబాలు కూడా ఆ కర్మలను అనుభవించే పరిస్థితి వస్తుందని గుర్తించాలి.