వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇద్దరు దివ్యాంగులతో సమయాన్ని గడిపారు.

గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు.

వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. వారిద్దరూ మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక వెసులుబాటు దొరికింది’ అని చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. అనంతరం దివ్యాంగుల దినోత్సవ కేక్ ను కట్ చేశారు.