తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడం, రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని తేలిపోవడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తెలుగునాట చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌కి ఎదురయిన పరాభవంతో రజనీకాంత్‌కి ఎలాంటి అనుభవం ఎదురవుతుందోననే భయం కొందరిలో వుంది. రజనీకాంత్ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఇటు మెగా ఫాన్స్ కూడా ఆసక్తిగా చూస్తారు. వారితో పాటు మెగా వ్యతిరేక హీరోల అభిమానులు కూడా రజనీ రాజకీయ ప్రస్థానంపై దృష్టి పెడతారు.
చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల ఓటమిని ఫాన్స్ పలు విధాలుగా సమర్ధించుకున్నారు. ఇప్పటి మీడియా ఎక్సర్‌సైజ్‌ని దాటి గెలవడం కష్టమని, టీడీపీ, వైసీపీ ధన బలం ముందు వాళ్లు నిలబడలేకపోయారని అనుకుని ఊరుకున్నారు. కానీ రజనీకాంత్ కనుక అలాంటి అననుకూలతలను అధిగమించి రాణిస్తే మాత్రం మెగా ఫాన్స్ ఇరుకున పడతారు. మిగతా హీరోల అభిమానులు ట్రోలింగ్‌లో రెచ్చిపోతారు. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు వేరుగా వున్నాయి. ఇప్పుడక్కడ రాజకీయ శూన్యత నెలకొంది కనుక అది రజనీకాంత్‌కి ప్లస్ పాయింట్ అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అవన్నీ ట్రోల్ చేసే వారు కన్సిడర్ చేయరు కనుక వచ్చే ఎన్నికల నాటికి అయినా పవన్ తన సత్తా చాటుకోని పక్షంలో మెగా అభిమానులకు సోషల్ మీడియాలో అజ్ఞాతవాసం తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates