బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఢాకా అల్లర్ల కేసులో హసీనాకు ఈ శిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకుంటోంది. షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయబడింది. హసీనాను దోషిగా ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తేల్చింది.
హసీనా నేరం చేసిందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హసీనా మానవత్వాన్ని మరిచింది, ఆమె చేతులు రక్తంతో తడిచాయి.. ఆందోళనకారుల్ని చంపమని హసీనా ఆదేశాలు జారీ చేశారు అని కోర్టు పేర్కొంది.
2024 లో బంగ్లాదేశ్ ఘర్షణల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ అల్లర్లలో 300 మందికి మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా ఇంటిని ముట్టడించడంతో ఆమె రాజీనామా చేసి భారత్ కి జారుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని షేక్ హసీనా పేర్కొన్నారు. తీర్పు వెల్లడించడానికి ముందు ఆమె సోమవారం పార్టీ మద్దతుదారులకు ఆడియో సందేశాన్ని పంపారు.
తన మద్దతుదారులు ఆందోళన చెందవద్దని అన్నారు. తాను బ్రతికే ఉంటానని, మళ్లీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని, బంగ్లాదేశ్ కి న్యాయం చేస్తానని అన్నారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో బంగ్లాదేశ్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఢాకాలో యూనస్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా భారీగా భధ్రతా దళాలను మోహరించింది.
This post was last modified on November 17, 2025 2:59 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…