వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానిపై ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా స్పందించారు.
“పాలు లేని కల్తీ నెయ్యిలో మతోన్మాదాన్ని కలపకుండా, కల్తీ రాజకీయం చేయకుండా ఇప్పటికైనా తప్పు చేసిన వాడిని శిక్షించే పని చూడండి” అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. “ఎందుకు ప్రతి దాంట్లో మతోన్మాదం, జాతి ద్వేషం మాత్రమే మీకు కనిపిస్తాయో ఆలోచించండి” అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.
గతంలోనూ కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. “ప్రియమైన పవన్ కల్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది. దయచేసి దానిపై దర్యాప్తు చేసి, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. దేశవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తించేలా విషయాన్ని ప్రచారం చేయడం ఎందుకు? దేశంలో ఇప్పటికే మత సామరస్యానికి భంగం కలిగించే పరిస్థితులు తలెత్తుతున్నాయి” అని పేర్కొన్నారు.
ఈ కామెంట్లపై కూడా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. కల్తీ నెయ్యి నిజమేనని ఇప్పుడు సిట్ తేల్చింది. మరి కల్తీ రాజకీయం ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates