కరణం బలరామకృష్ణమూర్తి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న సీనియర్ నాయకుడు. తొలుత ఆయన ప్రస్థానం కాంగ్రెస్ తో ప్రారంభమైంది. ఇందిరా గాంధీకి అత్యంత విధేయుడుగా పేరు తెచ్చుకున్న కరణం బలరాం.. ఈ క్రమంలోని అద్దంకి నియోజకవర్గం నుంచి 1978లోనే పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంటుకు కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో టిడిపిలోకి వచ్చిన ఆయన ఆ పార్టీలోనూ పలుమార్లు విజయం దక్కించుకున్నారు.
పార్టీకి విధేయుడుగా కూడా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు పార్టీ తరఫున గెలిచినప్పటికీ తర్వాత కాలంలో కేసులు.. ఇతరత్రా పనులు నేపథ్యంలో ఆయన వైసీపీకి మద్దతు పలికారు. దీంతో అప్పటినుంచి కరణం బలరాం రాజకీయ ప్రస్థానం దిగజారితూ వచ్చిందనే వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కు చీరాల టికెట్ ఇప్పించుకున్నారు. కానీ, కూటమి ప్రభావంతో వెంకటేష్ పరాజయం పాలయ్యారు. అటు కరణం బలరాం, ఇటు ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే ఎటు చెప్పుకోలేని పరిస్థితి. ఎటు రాలేని పరిస్థితి.. ఎదుర్కొంటున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
దీనికి కారణం టిడిపిలో అవకాశాలు లేవు. అటు వైసీపీలో ఉన్నా పుంజుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో కరణం బలరాం రాజకీయాలు ముగిసినట్టే అన్నది చీరాలలో వినిపిస్తున్న మాట. వాస్తవానికి సీనియర్ నాయకులు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వారి వారసులు రంగ ప్రవేశం చేస్తూ ఉంటారు. కాబట్టి అంత తేలిగ్గా ముగిసింది అని అనుకోలేము. అయితే, కొంత వెనకబడ్డారనేది మాత్రం వాస్తవమే. మరోవైపు యువనాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్న టిడిపి వెంకటేష్ కు ఏ మాత్రం అవకాశాలు ఇస్తుంది అనేది కూడా సందేహంగానే ఉంది.
ఎందుకంటే ఎంత విధేయులు అయినప్పటికీ పార్టీ మారి వైసీపీకి ఫేవర్‌గా పనిచేయడం మైనస్ గా ఉంది. ఇప్పుడు అదే విషయంపై చర్చ కూడా నడుస్తుంది. సో కొన్నాళ్లపాటు బలరాం కుటుంబం రాజకీయాలు నత్తనడకని సాగనున్నాయన్నది స్పష్టమవుతుంది. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంటున్నారు. కానీ, మరోవైపు టిడిపి భారీ స్థాయిలో పుంజుకుంటోంది. చీరాల ఎమ్మెల్యే సహా ఇతర నాయకులు కూడా ప్రజల మధ్య ఉంటున్నారు. ఈ క్రమంలో కరణం కుటుంబ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి.. తండ్రి తనయుల పరిస్థితి ఎలా ఉంటుందనేది.. అనేది వచ్చే ఎన్నికల వరకు సందేహంగానే ఉందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates