రాయలసీమపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందా? విపక్ష వైసీపీకి బలమైన కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయాలనిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది రెండు కీలక కార్యక్రమాలను సీమలో నిర్వహించడం ద్వారా కూటమి పార్టీలు ఈ వ్యూహాన్ని బలపరుస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అయితే చాలా పక్కా ప్లాన్‌తోనే వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత ఇలాకా కడపలోనే పెట్టారు. అప్పట్లోనే బలమైన సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలోనూ విజయం సాధించాలని స్పష్టంగా చెప్పారు. అంటే కడప మొత్తంగా పసుపు మయం కావాలని ఆయన కోరుకున్నారు. ఇది అప్పట్లోనే వైసీపీకి డెత్ బెల్స్ మోగించిందన్న చర్చ ఉంది. ఇక ఇప్పుడు టీడీపీకి బలమైన అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం ద్వారా మరిన్ని సంకేతాలు ఇచ్చినట్టు అయిందని అంటున్నారు.
గత ఎన్నికల్లో సీమలోని 53 అసెంబ్లీ స్థానాల్లో 49 స్థానాల్లో టీడీపీ కూటమి పార్టీలు విజయం సాధించాయి. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. దీంతో ఇప్పుడు మరింత జోరుగా ముందుకు సాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఒకవేళ వ్యతిరేకత పెరిగితే అది సీమ నుంచే ప్రారంభం అవుతుంది. గతంలోనూ ఇదే జరిగింది. టీడీపీ 2019లో ఓడినప్పుడు కేవలం మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక వైసీపీ నాలుగుకే పరిమితమైంది. అంటే సీమలోనే చైతన్యం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీకి చోటు లేకుండా సీమను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే, అధికారంలోకి రాకుండా ఆ పార్టీని అడ్డుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉంటే, ఉత్తరాంధ్రలో టీడీపీ బలంగా ఉంది. ఇలా మూడు ప్రాంతాల్లోనూ కూటమి పక్కా లెక్కలు వేసుకుని సీమపైనే ఎక్కువగా ఫోకస్ పెంచిందన్న చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై భారీ స్థాయిలో కసరత్తు చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే దీనిని వైసీపీ ఎంత మేరకు అడ్డుకుంటుందనేది చూడాలి.
This post was last modified on September 11, 2025 6:41 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…