Trends

అమ్ముడవని ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు

ప్రత్యర్థి ఎవరైనా సరే.. భారత జట్టు మ్యాచ్ ఆడుతోందంటే క్రికెట్ ప్రపంచమంతా అటు వైపు చూస్తుంది. ఇక ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఎలా ఊగిపోతారో తెలిసిందే. అందులోనూ మల్టీ నేషన్స్ టోర్నీల్లో ఇండియా ఆడుతుంటే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ బుధవారం నాడు ఆసియా కప్ టోర్నీలో భారత తన తొలి మ్యాచ్ ఆడినట్లు చాలామంది ఇండియన్ ఫ్యాన్స్‌కు తెలియని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. మామూలుగా ఆసియా కప్‌కు అభిమానుల్లో మంచి డిమాండే ఉంటుంది. పైగా గత పర్యాయం వన్డే ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీని.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన పొట్టి ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. అయినా సరే టోర్నీకి హైప్ కనిపించడం లేదు. బహుశా ఇంత తక్కువ హైప్‌తో ఆసియా కప్ ఇప్పటిదాకా జరిగి ఉండకపోవచ్చు.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు టికెట్లు పూర్తిగా అమ్ముడవలేదు. టోర్నీ ఏదైనా సరే. ఇండియా, పాకిస్థాన్ ఆడుతున్నాయంటే ఇలా టికెట్లు పెట్టడం ఆలస్యం అలా సోల్డ్ ఔట్ అయిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం మ్యాచ్ దగ్గర పడుతున్నా కూడా టికెట్ల అమ్మకం పూర్తి కాలేదట. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ పట్ల మన వాళ్లలో తీవ్ర వ్యతిరేక భావం ఏర్పడింది. అలాంటి టెర్రరిస్ట్ కంట్రీతో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలని జనం కోరుకుంటున్నారు.

క్రికెట్ విషయంలో రాజీ వద్దనుకుంటున్నారు. ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ తలపడబోతున్నట్లు తెలియగానే సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. లెజెండ్స్ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లను ఒకటికి రెండుసార్లు బహిష్కరించిన రిటైర్డ్ క్రికెటర్లకు గొప్ప మద్దతు లభించింది. బీసీసీఐ మాత్రం దీనికి భిన్నంగా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియన్ టీం మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై నెటిజన్లు మండిపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ మ్యాచ్‌‌ల పట్ల అభిమానుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి చూసే సెలబ్రెటీలు, బిగ్ షాట్స్ సైతం.. జనాగ్రహాన్ని గ్రహించి ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నట్లున్నారు. అందుకే ఈసారి ఈ మ్యాచ్ టికెట్లు అమ్ముడవని పరిస్థితి కనిపిస్తోంది.

This post was last modified on September 11, 2025 6:18 pm

Share

Recent Posts

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

3 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

6 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

8 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

9 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

9 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

10 hours ago