వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన అధికారం కోల్పోయినా అహంకారం కోల్పోలేదని, ఇంకా వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారని వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా బుధవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా విశ్లేషకుల నుంచి విమర్శకుల వరకూ జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఏమాత్రం బాధ్యత లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికలకే కాదు, ఇకపై ఎప్పటికీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు.
ఏంటి రీజన్
బుధవారం మీడియాతో రెండున్నర గంటల పాటు మాట్లాడిన జగన్, రాష్ట్రంలో తన హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రభుత్వం నిర్మించే విషయంపై నిప్పులు చెరిగారు. అయితే ఈ సమయంలో తాజాగా కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లోని లోపాలను ఆయన ఎత్తి చూపిస్తే, ఏవైనా మెరుగైన సూచనలు చేస్తే అందరూ హర్షించేవారు. వైసీపీ హయాంలో నిజంగానే 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రతిపాదించబడ్డాయి. దీనిని ఎవరూ ఖండించడం లేదు.
అయితే అప్పట్లోనే నిధులు కేటాయించలేక కేవలం 5 కాలేజీలను మాత్రమే నిర్మించారు. వీటిలో రెండు కాలేజీల్లో మాత్రమే తరగతులు జరుగుతున్నాయి. మరో మూడు 80 శాతం పూర్తయ్యి మిగిలిన పనుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక ఏమాత్రం పనులే ప్రారంభం కానివి 10 ఉన్నాయి. వీటి నిర్మాణానికి సుమారు 6-10 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. ప్రస్తుతం ఆ నిధులు లేవన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని పీపీపీ విధానంలో అప్పగించేందుకు రెడీ అయింది. అయితే జగన్ దీనిని వ్యతిరేకిస్తున్నారు.
ఆయన ఆలోచన మంచిదే కావొచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో చెప్పవచ్చు. లేదా కేంద్రంతో సంబంధాలు బాగానే ఉన్నందున నేరుగా ఆయనే జోక్యం చేసుకుని నిధులు ఇవ్వమని కోరవచ్చు. తద్వారా తానే తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను తానే పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవచ్చు. కానీ ఇవన్నీ జగన్ వదిలేశారు.
పీపీపీ విధానంలో ఆయా కాలేజీలను నిర్మించాలనుకుంటున్న సంస్థలను జగన్ తీవ్రంగా బెదిరించారు. “ఎవరు వస్తారో రండి, టెండర్లలో పాల్గొనండి. కానీ మేం వచ్చాక వాటిని రద్దు చేస్తాం, వెనక్కి తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఇది పెట్టుబడిదారులను భయపెట్టడమేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
జగన్ ఇదే ధోరణితో ముందుకు సాగితే, ఆయన తన పతనాన్ని మరింత వేగంగా తానే రెడీ చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.
This post was last modified on September 11, 2025 6:46 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…