Political News

‘సూపర్’ గ్రాండ్ సక్సెస్!… టైమంటే టైమే!

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి బుధవారం అనంతపురంలో తొలి విజయోత్సవ సభ “సూపర్ సిక్స్..సూపర్ హిట్”ను నిర్వహించింది. కూటమి పాలన మొదలై 15 నెలలు గడిచిన నేపథ్యంలో తమ పాలన ఎలా సాగిందన్న విషయాన్ని జనానికి చెప్పేందుకు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎలా సాగుతోందన్న విషయాలను వివరించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా ఈ సభను నిర్వహించాయి. ఈ సభ గ్రాండ్ సక్సెస్ గా ముగిసిందని చెప్పక తప్పదు. అంతేకాకుండా మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం ప్రారంభం అవుతుందని చెప్పిన కూటమి సరిగ్గా అదే సమయానికి సభను ప్రారంభించి నిర్దేశిత సమయంలోనే ముగించింది.

ఈ సభ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అద్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్దేశిత సమయానికే సభా స్థలికి చేరుకున్నారు. అమరావతి నుంచి వేర్వేరుగా అనంతపురం బయలుదేరిన బాబు, పవన్… 2.40 గంటల కంతా సభా స్థలికి చేరుకుని సభా వేదికపై ఆసీనులయ్యారు. సరిగ్గా 3 గంటల సమయానికంతా నేతల ప్రసంగాలు మొదలయ్యాయి. తొలుత బీజేపీ నేతలు మాట్లాడాక… పవన్ కల్యాణ్ స్వల్ప ప్రసంగం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగంతో సభ 5 గంటలలోపే ముగిసింది.

ఇక సభ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో మారుమోగిపోయింది. ప్రత్యేకించి టీడీపీ శ్రేణులను నిలువరించడానికి సాధ్యమే కాలేదు. వాస్తవానికి సభకు 3.5 లక్షల మందిని తరలించాలని కూటమి నేతలు భావించగా… సబా స్థలిలో అంతకుమించి అన్నట్లు 5 లక్షల దాకా జనం వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు ప్రసంగం సాంతం సభను హోరెత్తించింది. బాబు ప్రసంగిస్తుంటే… సభకు హాజరైన జనసందోహం ఉద్వేగంతో ఊగిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. బాబు ప్రసంగానికి ఓ రేంజిలో జనం నుంచి అప్లాజ్ రావడమే కాకుండా సభా స్థలిని ఉర్రూతలూగించింది. కేటమి సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి బాబు చెబుతున్నప్పుడు ఏ రేంజిలో జనం ఉప్పొంగారో…విపక్ష నేత జగన్ ను బాబు విమర్శిస్తున్నప్పుడు అంతకుమించి కేకలు ఈలలు వేశారు.

అనంతపురం జిల్లా అది కూడా రాష్ట్రానికి మారుమూల జిల్లా… అక్కడ విజయోత్సవ సభ పెడితే సక్సెస్ అవుతామా? అన్న అనుమానం ఏమాత్రం లేకుండా కూటమి పార్టీల నేతలు అడుగు ముందుకు వేశారు. ఇటీవలే కడప జిల్లాలో పులివెందుల సహా రెండు జడ్పీటీసీలను టీడీపీ గెలుచుకున్న ఉత్సాహం అనంతపురం సభను దిగ్విజయం చేసిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీకి, జగన్ కు గట్టి పట్టున్న రాయలసీమలో టీడీపీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా… అనంతపురం సభ మూడో అడుగుగా గ్రాండ్ సక్సెస్ గా ముగిసిందని చెప్పక తప్పదు.

This post was last modified on September 10, 2025 10:11 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago