జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని మరోసారి నిరూపించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డ నేతలపై వేటు తప్పదని పవన్ గతంలో చాలాసార్లు హెచ్చరించారు. జనసేన నేతలు నిబద్ధతగా ఉంటూ జనసైనికులు, ప్రజలకు ఆదర్శప్రాయంగా వ్యవహరించాలని..లేని పక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి వెనుకాడనని పవన్ ఎన్నోసార్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు జనసేన ఇన్చార్జి టీవీ రామారావును సస్పెండ్ చేసిన పవన్..తాజాగా మరో జనసేన మహిళా నేతపై వేటు వేశారు.
శ్రీకాళహస్తి జనసేనే ఇన్చార్జి వినుత కోటను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆమె వ్యవహార శైలి పార్టీ విధివిధానాలకు భిన్నంగా ఉన్నందున కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నామని జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఓ లేఖ విడుదల చేశారు. ఇటీవల ఆమెపై చెన్నైలో ఓ హత్య కేసులో ఆరోపణలు రావడంతో తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే పవన్ కు, జగన్ కు ఉన్న తేడా ఇదీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శవాన్ని డోర్ డెలివరీ చేసి జైలుకు వెళ్లి వచ్చిన ఎమ్మెల్సీ అనంత బాబు వంటి నేతలను జగన్ ఎంకరేజ్ చేస్తున్న వైనాన్ని నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. హత్య కేసులో వినుత కోటపై ఆరోపణలు వచ్చిన వెంటనే పవన్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన వైనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తనలా జైలుకు వెళ్లి వచ్చినా పర్వలేదు అన్న నేతలను జగన్ పార్టీలో కొనసాగిస్తుంటే…పవన్ మాత్రం తనలా నిజాయితీగా ఉండే నాయకులు మాత్రమే పార్టీలో ఉండాలని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates