జగనేంటి.. గాబరా పడడం ఏంటి? ఆయనంత ధైర్యశాలి.. ఎదిరించే తత్వం ఉన్న నాయకుడు.. మొండి ఘటం… మరొకరు లేరని అనుకుంటున్నారా?!. కానీ.. అవన్నీ ఇప్పుడు పనిచేయడం లేదు. ఆ మొండి తనం.. ఆ ధైర్యం.. ఆ దీక్ష.. వంటివి కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే.. రాజకీయాలు.. ఓటు బ్యాంకు అలాంటివి మరి! ముఖ్యమంత్రి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుపై చేసినంత వేగంగా.. చురుగ్గా పవన్ పై విమర్శలు చేయలేకపోవడమే దీనికి కారణం.
చంద్రబాబు పై అంటే.. ఎలా అయినా మాట్లేడేయొచ్చు. ఆయన స్వభావం అలాంటిది. రాజకీయ స్థిత ప్రజ్ఞత కూడా ఉంది కాబట్టి.. చంద్రబాబును ఏమన్నా పట్టించుకోరు. అందుకే.. జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. పైగా.. చంద్రబాబు ఆగ్రహించినా.. యువత ఓట్లు ప్రభావితం కావు. జగన్‌కు పడేవి పడతాయి. ఇక, తన సామాజిక వర్గాన్ని చంద్రబాబు ఎలానూ ప్రభావితం చేయలేరు. తనతో ఉన్నవారు తనతోనే ఉంటారు. జగన్ వెంట వెళ్లేవారు.. జగన్ వెంట వెళ్తారు. అందుకే.. చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తారు.
కానీ.. అంత తేలికగా పవన్ పై ఇటీవల కాలంలో జగన్ విమర్శలు చేయడం లేదు. అసలు నోరు కూడా మెదపడం లేదు. దీనికి ప్రధానంగా 2024 ఎన్నికల ఎఫక్టే. మూడు పెళ్లిళ్లు.. సంసారాలు అంటూ.. పవన్‌పై చేసిన వ్యాఖ్యలు జగన్‌కు బాగా రిజల్ట్ ఇచ్చాయి. ఇటు మహిళా ఓటు బ్యాంకు.. అటు యువత ఓటు బ్యాంకు కూడా దూరమైంది. మరోవైపు.. మావోణ్ని ఇలా దిగజారుడు మాటలు అంటారా? అంటూ.. కాపులు కూడా యాంటీ అయ్యారు. దీంతోనే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.
ఈ పరిణామాల క్రమంలోనే ఏడాది అయిన తర్వాత.. కూడా పవన్‌ను పన్నెత్తు మాట అనేందుకు జగన్ గిజగిజలాడుతున్నారు. ఏమంటే.. ఏవర్గానికి కోపమొస్తుందో.. ఏ ఓటు యాంటీ అవుతుందో అనే చింత పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. అనాలని ఉన్నా.. అనలేని పరిస్థితి ఏర్పడిపోయింది. కాపులు ఇప్పటికే దూరమయ్యారు. యువత కూడా అలానే ఉన్నారు. కనీసం.. సింపతీ అయినా దక్కించుకుని వచ్చే ఎన్నికల నాటికి వారిని మచ్చిక చేసుకోవాలంటే పవన్ జోలికి పోకుండా ఉండడమే బెటర్ అని జగన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates