వైసీపీ అధినేత జగన్ కేసులకు భయపడుతున్నారా? ఒకప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు కోల్పోయారా? అంటే.. తాజాగా జరిగిన పరిణామం.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే అక్రమాస్తుల కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, వాటి విషయంలో ఒకప్పుడు 16 మాసాల పాటు జైలుకు వెళ్లిన విషయం కూడాఅందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ.. తాజాగా మాత్రం ఆయన యూటర్న్ తీసుకున్నారు.
కేసులు ఎదుర్కొనే పరిస్థితి లేదని గ్రహించారో ఏమో తెలియదు కానీ.. తనపై నమోదైన కేసును కొట్టి వేయా లని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని అర్జంటుగావిచారించాలని కూడా జగన్ కోరడం గమనార్హం. ఈ మేరకు బుధవారంమధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే.. దీనిని అప్పటి కప్పుడు విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసు అంత అర్జంటుగా విచారించాల్సిన అవసరం లేదని తేల్చింది. ఈ క్రమంలోనే గురువారానికి వాయిదా వేసింది.
ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్ కింద పడి సొంత పార్టీ కార్యకర్త నలిగిపోయారు. ఈ కేసులో జగన్ కారును నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా పోలీసులు నమోదు చేశారు. ఇక, ఏ2గా జగన్ పేరును పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలిసి కూడా జగన్ అక్కడ నుంచి వెళ్లిపోయారన్నది పోలీసులు నమోదు చేసిన కేసును బట్టి తెలుస్తోంది.
ఈ పరిణామాలతోపాటు.. ఇతర నాయకులు పేర్ని నాని, విడదల రజనీ, జగన్ పీఏపైనా కేసులు పెట్టారు. ఈ క్రమంలో పేర్ని, విడదల ఇప్పటికే తమపై నమోదైన కేసులు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా తనపై నమోదైన కేసును కూడా కొట్టేయాలని జగన్ లంచ్ మోషన్ దాఖలు చేశారు. అయితే.. కోర్టు మాత్రం దీనినిఅర్జంటుగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. గురువారానికి వాయిదా వేసింది. దీంతో కేసులు ఎదుర్కొనే ధైర్యం జగన్ కోల్పోతున్నారా? అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates