అజ్జూ భాయా?… ఆయన ఎవరు? అంటారా? ఈ తరానికి పెద్దగా గుర్తుండకపోవచ్చు గానీ… పాత తరానికి మాత్రం ఆయన ఓ సూపర్ డూపర్ క్రికెట్ హీరో. అంతేకాదండోయ్… జెంటిల్మన్ గేమ్ లాంటి క్రికెట్ కు ఫిక్సింగ్ మకిలీ అంటించిన వారిలో ఈయన ఒకరుగా అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. ఇదంతా గతం అయితే… ఇప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ లో మహ్మద్ అజారుద్దీన్ పేరు మారుమోగిపోతోంది. క్రికెట్ ను వీడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న అజార్… ఓసారి హైదరాబాద్ ఎంపీగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఇప్పుడు బీఆర్ఎస్ దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఇటీవలే మరణించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి బైపోల్స్ తప్పనిసరి. ఇంకా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వలేదు. పార్టీలు పెద్దగా దీని గురించి పట్టించుకోనూ లేదు. అయితే అజార్ మాత్రం అప్పుడే మేల్కోన్నారు. ఎక్కడ జూబ్లీహిల్స్ టికెట్ ను ఎవరైనా ఎగురవేసుకుపోతారోనన్న భయంతో ఆయన చాలా ముందుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా జూబ్లీ హిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగేది నేనే… గెలిచేది కూడా తానేనని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా కాంగ్రెస్ అధిష్ఠానంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
అంతటితో ఆగని అజార్… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా ఎన్నెన్నో ప్రచారాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. అయితే చివరాఖరుకు టికెట్ దక్కేది మాత్రం తనకేనని ఆయన పేర్కొనడం గమనార్హం, గత ఎన్నికల్లో తాను పెద్దగా ప్రచారం చేయలేకపోయానని… ఈ కారణంగానే తాను ఓడిపోయానని.. అయితే ఈ దఫా ఆ తప్పు జరగనివ్వనని అజార్ అన్నారు. ఎలాగైనా జూబ్లీహిల్స్ బైపోల్స్ గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతానని ఆయన అన్నారు. నిజంగానే అజారుద్దీన్ వ్యాఖ్యలు చూస్తుంటే… కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ కలగూర గంప. అలాంటి పార్టీలో ఇలా బహిరంగంగా ఇంత ఘాటు వ్యాఖ్యలు చేశారంటే ఆయనకు గట్టి దమ్మున్నట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇక అజార్ క్రికెట్ కెరీర్ గురించి గర్తు చేసుకుంటే… వీవీఎస్ లక్ష్మణ్ కంటే చాలా ఏళ్ల ముందు నుంచి టీమిండియా అజారుద్దీన్ కీలక ఆటగాడిగా కొనసాగారు. సెంచరీలు అవలీలగా కొట్టే అజార్… ఫీల్డింగ్ లో మాత్రం తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఫీల్డింగ్ లో అల్లంత దూరాన బాల్ ను పట్టుకుని వికెట్లను చూడకుండా… తాను ఏ డైరెక్షన్ లో ఉన్నానన్న విషయాన్ని పక్కనపెట్టి… ఆయన విసిరే బంతులు వికెట్లను గిరాటేసి ఎందరినో రనౌట్ చేశాయి. ఇక భారత జట్టుకు చాలా కాలం ఆయన కెప్టెన్ గానూ వ్యవహరించారు. మొన్నటిదాకా టీమిండియా బెస్ట్ కెప్టెన్ల జాబితాలో అజార్ పేరు కూడా వినిపించేది.
This post was last modified on June 21, 2025 11:42 am
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…