11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలన్నింటా యోగాసనాలు వేస్తూ జనం ఉల్లాసంగా కనిపించారు. ఇక యోగా దినోత్సానికే నాందీ పలికిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం 11న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరుపుకున్నారు. ఇందుకోసం శుక్రవారమే విశాఖ చేరుకున్న మోదీ… శనివారం ఉదయమే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర ప్రముఖులతో కలిసి యోగా దినోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతే అయినా… దానికి ఇంతలా ప్రాచుర్యం తీసుకొచ్చింది మాత్రం మోదీనే అని చెప్పారు. చరిత్రను సృష్టించాలన్నా…దానిని తిరగరాయాలన్నా ఒక్క మోదీకి మాత్రమే సాధ్యమని బాబు అన్నారు. ప్రపంచం జూన్ 21న యోగాను ఓ పండుగలా జరుపుకుంటున్నారంటే దానికి మోదీనే కారణమని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. యోగా వేడుకల్లో ఇప్పటికే పలు రికార్డులు నమోదు కాగా… ఏటికేడు ఆ రికార్డులన్నీ మోదీ వల్లే బద్దలు అవుతున్నాయని ఆయన చెప్పారు.
యోగా సంపూర్ణ ఆరోగ్యానికి ఆయువుపట్టు అన్న విషయాన్ని ఎందరో మహర్షులు చెప్పినా… అంతగా పట్టించుకోని జనం… యోగాను ఆచరిద్దాం… ఆరోగ్యంగా ఉందామంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు మాత్రం ఓ రేంజి మద్దతు లభించిందని చంద్రబాబు అన్నారు. అలాంటి మోదీ 11 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ రావడం, ఇక్కడి నుంచే యోగా దినోత్సవాన్ని మోదీ ప్రారంభించడం ఏపీ ప్రజల అదృష్టమని ఆయన అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన యోగాసనాల్లో విశాఖ జనం తండోపతండాలుగా పాలుపంచుకోవడంతో బీచ్ మొత్తం కలర్ ఫుల్ గా మారిపోయింది.
This post was last modified on June 21, 2025 11:34 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…