కొమ్మినేని కామెంట్లపై జడ్జి షాకింగ్ వ్యాఖ్యలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చర్చ నిర్వహించిన జర్నలిస్ట్ కొమ్మినేని వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొమ్మినేని నీళ్లు నమిలారట. కృష్ణంరాజు అటువంటి వ్యాఖ్యలు చేసిన వెంటనే ఖండించకుండా ఏం చేస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారట.

డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్ గా చర్చలో ఏ విషయాలు ప్రస్తావించాలి, చర్చించాలి, ఏ అంశాలపై చర్చను అనుమతించాలి అన్న స్పష్టత ఉంటుంది కదా అని కొమ్మినేనిని న్యాయమూర్తి నిలదీశారట. అమరావతి రాజధాని చుట్టూ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులున్నారని కృష్ణంరాజు దుర్మార్గంగా మాట్లాడుతున్నప్పుడు వాటిని ఎందుకు ఖండించలేదని కొమ్మినేని కార్నర్ చేశారట. పైగా, ముస్లిం దేవతలు, క్రిస్టియన్ దేవతలు అని వ్యగ్యంగా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారట.

అలా మాట్లాడడాన్ని కృష్ణంరాజు వ్యాఖ్యలను ప్రోత్సహించినట్లేనని భావించవచ్చు కదా అని అన్నారట. కాబట్టి, మీరు శిక్షార్హులే అని జడ్జి అనడంతో కొమ్మినేని ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ సైలెంట్ అయ్యారట. ఆ తర్వాత తానేమీ మాట్లాడలేదని, తన తప్పేమీ లేదని కప్పిబుచ్చుకున్నారట. కానీ, జడ్జి మాత్రం కొమ్మినేని చేసిన కామెంట్లు సీరియస్ గా తీసుకొని ఆయనకు బెయిల్ నిరాకరించి…14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారట.