మహిళల తిరుగుబాటు ఎలా ఉంటుందో వైసీపీ అధినేత జగన్ మీడియాకు తెలిసి వచ్చింది. అమరావతి లో నివసించే మహిళలపై ఓ అనలిస్టు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలపై మహిళలు తిరగబడ్డారు. ఆదివా రం, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన మహిళలు.. సోమవారం.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుతో శాంతించలేదు. జగన్, ఆయన సతీమణి, సాక్షి మీడియా చైర్మన్ భారతిలు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనన్న పట్టుదలతో కదం తొక్కారు.
విజయవాడ, ఆటో నగర్ లో సాక్షి కార్యాలయం పై టిడిపి మహిళలు, కార్యకర్తలు దాడి చేశారు. భారీ సంఖ్య లో తరలి వచ్చిన మహిళలు.. సాక్షి కార్యాలయాన్ని చుట్టుముట్టారు. “డౌన్ డౌన్ సాక్షి, అబద్ధాల ప్రచారం చేసే సాక్షి డౌన్ డౌన్” అంటూ నినాదాలతో హోరెత్తించారు. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసును, కృష్ణ రాజులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.(అప్పటికే కొమ్మినేని అరెస్టయ్యారు). అదేవిధంగా కార్యాలయం దగ్గర ఉన్న సాక్షి నేమ్ బోర్డు స్టీల్ అక్షరాలను తొలగించారు.
కొందరు మహిళలు.. గేటు పైకెక్కి నినాదాలు చేశారు. సాక్షి బోర్డును కాళ్లతోను, చెప్పులతోను తొక్కి ఉమ్మేశారు. మరికొందరు.. సాక్షి పత్రిక ప్రతులను తగుల బెట్టారు. అయితే.. ఈ విషయం తెలిసిన పోలీసులు వెం టనే అలెర్టయ్యారు. సాక్షి కార్యాలయం వద్దకు చేరుకుని మహిళలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే.. ఆగ్రహంతో ఉన్న మహిళలు.. పోలీసులపై కూడా విరుచుకుపడే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం శృతి మించుతుండడంతో పోలీసులు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దింపారు.