ఏపీ రాజధాని అమరావతిని దేవతల రాజధానిగా పేర్కొన్న చరిత్రను విస్మరించి.. నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించిన జర్నలిస్టు, వ్యాఖ్యాత కృష్ణంరాజుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని.. ఇలాంటివారిని ఉపేక్షించేది లేదన్నారు. కఠినంగా శిక్షించి తీరుతామని చెప్పారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనల ద్వారా మహిళలను అవమానించడం దారుణమని అన్నారు.
“ఇది కేవలం అమరావతినే కాదు.. అక్కడి మహిళలను.. ప్రపంచానికి పాఠాలు నేర్పి.. అజరామరంగా విల సిల్లిన బౌద్ధాన్ని కూడా దారుణంగా అవహేళన చేశారు. ఇది ఒక్క అమరావతికే కాదు.. యావత్ మహిళా లోకానికి కూడా అవమానం.” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతిపై కుట్ర జరుగుతోందని.. ఆ కుట్ర ఇప్పుడు మరో రూపంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. అమరావతికి ఎంతో ఘన చరిత్ర ఉంద ని తెలిపారు.
అలాంటి చరిత్రను విస్మరించి.. నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారిలో.. 32 శాతం ఎస్సీ, ఎస్టీలు, 14శాతం బీసీలు ఉన్నారని చెప్పారు. అలాంటి ప్రాంతంలోని మహిళలపై నోరు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. రాజకీయ విశ్లేషకు డి ముసుగులో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందన్నారు. ఇలాంటి వారిని కఠి నంగా శిక్షించి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates