రాజస్థాన్‌లోని బికనీర్‌లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం.. నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ చేపట్టి న ఆపరేషన్ సిందూర్ విషయాన్ని ప్రస్తావించారు. 22 నిమిషాల్లో పహల్గాంలో ఉగ్రవాదులు మన ఆడపడు చుల సిందూరం తుడిచేశారని, పేర్లు అడిగి మరీ కాల్చేశారని అన్నారు. అయితే.. ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం 23 నిమిషాల వ్యవధిలోనే పాకిస్థాన్‌కు చుక్కలు చూపించామన్నారు.
పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులను, వారి శిబిరాలను నేల మట్టం చేశామని ప్రధాని చెప్పారు. ఆపరేషన్ సిం దూర్ ద్వారా ఉగ్రవాదులను, వారి శిబిరాలను కూడా కూల్చేశామని తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చ లంటూ జరిగితే.. అది పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పైనేనని ప్రధాని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చిందని తెలిపారు. ఉగ్రవాదులు ఊహించని విధంగా వారికి శిక్ష విధించామ న్నారు.
భారత త్రివిధ దళాలు.. చక్రవ్యూహాన్ని సృష్టించి.. పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాయని ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తన స్థితి ఏంటో తెలుసుకోకపోతే.. తన వ్యవహారాలను మార్చుకోకపోతే.. పైసా పైసాకు వెతుక్కునేలా చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ క్రమంలో మూడు సూత్రాలను భారత్ పాటిస్తుందన్న ఆయన.. దౌత్య పరంగా పాకిస్థాన్‌ను ఎండగట్టడంతోపాటు.. ఉగ్రవాదంపై నిరంతర పోరును కొనసాగిస్తామని చెప్పారు. కాగా.. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల యావత్ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారని చెప్పారు.
“ఏప్రిల్ 22న, మన సోదరీమణుల మతం గురించి అడిగిన తర్వాత ఉగ్రవాదులు వారి నుదుటిపై ఉన్న సిందూరాన్ని తొలగించారు. పహల్గామ్‌లో బుల్లెట్లు పేలాయి. మన ఆడపడుచుల సిందూరం తొలిగింది. కానీ 140 కోట్ల మంది భారతీయులు ఆ బాధను అనుభవించారు. హర్ దేశ్‌వాసి నే ఏక్ జుట్ హో కర్ సంకల్ప్ లియా థాకి ఆటంక్‌వాదియోం కో మిట్టి మే మిలా దేంగే” (దేశ ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చారు. ఒకే సంకల్పం చెప్పారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేయడమే వారి సంకల్పం. అదే జరిగింది) అని ప్రధాని తీవ్రస్వరంతో హెచ్చరించారు.