ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు పలు జిల్లాల్లో ఆయన అనేక యాత్రలు, ఉద్య మాలు చేశారు. అదేవిధంగా ఆయన తనయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిం చారు. ఈ సమయంలో ప్రజలు వీరికి అనేక విన్నపాలు చేశారు. అనేక సమస్యలను కూడా వీరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో వారికి చంద్రబాబు, నారా లోకేష్ అనేక హామీలను ఇచ్చారు. అయితే.. వీటిని సూపర్ సిక్స్‌లో చేర్చలేదు. కానీ, ఆ హామీలపై తరచుగా ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల చంద్రబాబు స్వయంగా చేయించిన ఐవీఆర్ ఎస్ సర్వేలోనూ.. గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రజలు లేవనెత్తారు. ఆయా హామీలను నెరవేర్చాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రి వర్గం అనంతరం.. సుమా రు రాత్రి 10 గంటల వరకు సీఎం చంద్రబాబుకీలక మంత్రులతో నాటి ఎన్నికలకు ముందు మైఖికంగా ప్రజలకు ఇచ్చిన హామీల ను అమలు చేద్దామని ప్రతిపాదించారు. దీనికి సదరు మంత్రులు కూడా ఓకే చెప్పారు. తమకు కూడా అనుభవాలు ఎదురవు తున్నాయని.. ఎన్నికలకు ముందు తాము కూడా నియోజకవర్గాల్లో పర్యటించి.. పలుమౌఖిక హామీలు ఇచ్చామని.. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ మౌఖిక హామీల్లో కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమాలతోపాటు.. ఆర్థికేత అంశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన సీఎం చంద్రబాబు.. వాటిని తక్షణమే అమలు చేస్తే.. ప్రజల్లో ప్రభుత్వంపై సంతృప్తి పెరుగుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ప్రభుత్వంపై భారం కాని మౌఖిక హామీలను ఈ నెలలోనే ప్రారంభించి అమలు చేయాలని సూచించారు. దీనికి ఒక నిర్ణయం తీసుకుని.. అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే.. రూ.10 లక్షలలోపు ఇచ్చిన మౌఖిక హామీలను కూడా నెరవేరిస్తే బాగుంటుందని మంత్రులు సూచించగా.. దానిపైనా ఒక నివేదిక తయారు చేయాలని చంద్రబాబు కోరారు. దీంతో ఈ నెల చివరి నుంచే ఆయా హామీలను నెరవేర్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
ఇవీ.. మౌఖిక హామీలు..
- సీమలో వడ్డెర సామాజిక వర్గానికి పనిముట్ల పంపిణీ.
- రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు.
- ఉపాధి హామీలో వ్యవసాయ పనులు చేర్చడం.
- పోలవరం ముంపు మండలాల అభివృద్ది
- నియోజకవర్గాల్లో చిన్నపాటి కాల్వల ఏర్పాటు.
- బీడీ పంట(ఆకు)కు మార్కెటింగ్ సౌకర్యం.
- హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు.
- మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా.
- పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా(ప్రముఖ కవి) పేరు.
- ఎన్టీఆర్ జిల్లా పేరును కృష్ణాకు, కృష్ణాజిల్లా పేరును ఎన్టీఆర్ జిల్లా కు మార్పు.
- 2014-19 మధ్య కొనుగోలుచేసిన ట్రైసైకిళ్లను దివ్యాంగులకు పంపిణీ చేయడం.