కాంగ్రెస్‌తో క‌లిమి.. బీజేపీతో చెలిమి..!

Shashi Tharoor

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ప్లే చేస్తున్న పొలిటిక‌ల్ ట్రిక్స్ జాతీయ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బి క్కిరికి గురి చేస్తున్నాయి. కీలక స‌మ‌యంలో మోడీ అనుస‌రిస్తున్న రాజ‌కీయ వ్యూహాలు కాంగ్రెస్‌కు మింగు డు ప‌డ‌డం లేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏమి సేతురా.. అంటూ త‌ల ప‌ట్టుకుంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురం పార్ల‌మెంటు స‌భ్యుడు శ‌శి థ‌రూర్ ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటాడో తెలియక‌ కాంగ్రెస్ నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు.

కొన్నాళ్లుగా శ‌శిథ‌రూర్ మోడీ పాట పాడుతున్నారు. కేంద్రాన్ని ప‌లు సంద‌ర్భాల్లో కొనియాడారు. అంతేకా దు.. ఉన్న కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని.. పార్టీ మారాల ని చెబుతూనే ఇక ఎప్ప‌టికీ ఈ పార్టీ ఇంతే అంటూ.. త‌న‌దైన శైలిలో సెటైర్లు కూడా విసురుతున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్య ఉన్నద‌న్న కార‌ణంగా పార్టీ నాయ‌కులు కూడా సైలెంట్ గా ఉన్నారు.

కానీ, తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసిన అఖిల ప‌క్ష నేత‌ల బృందంలో శ‌శి థ‌రూర్‌ను ప్ర‌ధాని మోడీ స్వ‌యంగా ఎంపిక చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మ‌రింత షాకిచ్చింది. స‌హ‌జంగా కాంగ్రెస్ పార్టీ కొంద‌రి పేర్ల ను సూచించింది. పాకిస్థాన్ వైఖ‌రిని ప్ర‌పంచానికి చెప్పి.. ఆ దేశాన్ని ఉగ్ర సానుభూతి దేశంగా చూపించాల న్న‌ది కేంద్రం ప్ర‌య‌త్నం.. ఈ క్ర‌మంలోనే ఏడు బృందాల‌ను ఏర్పాటు చేసింది. దీనిలో ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన ఎంపీల‌ను ఎంపిక చేశారు.

అయితే.. కాంగ్రెస్ చెప్పిన వారిని ప‌క్క‌న పెట్టి.. నేరుగా శ‌శిథ‌రూర్‌ను ఎంపిక చేసింది. ఈ ఎంపికే కాంగ్రెస్ ను ఇర‌కాటంలో ప‌డేసింది. వ‌చ్చే ఏడాది కేర‌ళ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌డం. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన శ‌శిథ‌రూర్ బీజేపీ పంచ‌న చేరేందుకు దాదాపు సిద్ధ‌మైన‌ట్టు సంకేతాలు ఇచ్చిన నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు త‌ల ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఏదేమైనా ప్ర‌ధాని మోడీ వేసిన వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుంద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.