బాబు నామినేటెడ్ మంత్రం.. వైసీపీలో చ‌ర్చ‌..!

కూట‌మి ప్ర‌భుత్వం నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ చేప‌ట్టింది. తాజాగా 22 ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసింది. వీటిలో 16 టీడీపీ తీసుకుని.. మూడు జ‌న‌సేన‌కు.. 1 బీజేపీకి ఇచ్చింది. తొలిసారి రాజ‌కీయాల‌కు అతీతంగా అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం ఉద్య‌మించిన జేఏసీకి కేటాయించింది. అయితే.. దీనిపై సాధార‌ణంగా కూట‌మి నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ వ‌స్తుంది. త‌మ‌కు ద‌క్క‌లేద‌ని.. వేరేవారికి ద‌క్కింద‌ని.. లేదా మంచి ఈక్వేష‌న్ అని నాయ‌కులు చ‌ర్చించుకోవ‌డం కామ‌నే.

కానీ, చిత్రంగా చంద్ర‌బాబు భ‌ర్తీ చేసిన నామినేటెడ్ ప‌ద‌వుల‌ పై ఆ పార్టీ బ‌ద్ధ విరోధి వైసీపీలోనూ చ‌ర్చ జ‌రు గుతుండ‌డం గ‌మ‌నార్హం. మంచి ఈక్వేష‌న్‌ అంటూ వైసీపీ అనుకూల మీడియాలోనూ క‌థ‌నాలు రావ డం గ‌మ‌నార్హం. ఇక‌, వైసీపీ నాయ‌కులు కూడా ప్ర‌స్తుతం జ‌రిగిన భ‌ర్తీపై పెద‌వి విర‌వ‌డం లేదు. నొస‌ట‌లు చిట్లించ‌డం కూడా లేదు. పైగా.. భ‌ర్తీ అయినా.. నాయ‌కుల‌ను బేరీజు వేసుకుని మంచి పోస్టు.. మంచి రిక్రూట్‌మెంటు అని కామెంట్లు చేస్తున్నారు. పైకి చెప్ప‌క‌పోయినా.. ఈ చ‌ర్చ సాగుతోంది.

ఎందుకంటే.. గ‌న్ని వీరాంజ‌నేయులు, రాయ‌పాటి శైల‌జ‌, ఆల‌పాటి సురేష్‌, వల‌వ‌ల బాబ్జీ డాల‌ర్ దివాక‌ర్ రెడ్డి(తిరుప‌తి), సుగుణ‌మ్మ‌.. ఇలా చాలా మంది వివాద‌ర‌హిత నాయ‌కుల‌కు, స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల నేర్పున్న వ్య‌క్తుల‌కు చంద్ర‌బాబుఏరికోరి ఎంపిక చేశారు. వీరి విష‌యాన్ని వైసీపీ నాయ‌కులు సైతం మెచ్చుకునేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి నామినేటెడ్ అంటే.. చంద్ర‌బాబు ఎవ‌రికి ఇచ్చినా.. ఎవ‌రూ అడిగే ప్ర‌శ్న‌లేదు. అయినా.. ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

ఇక‌, మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. నా ఎస్సీలు, నా బీసీలు, ఎస్టీలు అంటూ.. ప‌దే ప‌దే చెప్పి.. వారికి మేలు చేస్తున్నానని ప్ర‌క‌టించుకున్న జ‌గ‌న్‌.. ఇత‌ర ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాల‌ను దూరం చేసుకున్నారు. పోనీ.. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీలైనా బాగుప‌డ్డారా? అనేది ప్ర‌శ్న‌. కానీ.. చంద్ర‌బాబు పైకి చెప్ప‌క‌పోయినా.. బీసీలు ఎనిమిది మందికి, ఎస్సీ, ఎస్టీలు, ఓసీల‌కు ప్రాధాన్యం ఇచ్చారు.

వారికి కోర‌కుండానే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఈ ఈక్వేష‌న్‌పై ఆయ‌న ఎక్క‌డా ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. సో.. ఇలా.. నామినేట‌డ్ మంత్రంఫ‌లించేస‌రికి వైసీపీ నాయ‌కులు కూడా బాగుంద‌నే అంటున్నారు. ఇక‌, నిరంత‌రం బాబును విమ‌ర్శించే వైసీపీ అనుకూల మీడియాలోనూ తాజా భ‌ర్తీపై సానుకూల క‌థ‌నాలు రావ‌డం గ‌మ‌నార్హం.