వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో తీసుకుని.. ఇతర భత్యాలు కూడా తీసుకున్న వారు.. ఇప్పుడు ఏమయ్యారు? ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లో కాదు.. ఆయా పదవులను కట్టబెట్టిన వైపీసీ అధినేత జగన్ సంధిస్తున్నారు.
“ప్రస్తుతం వారంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఒక్కసారి నాకు ఫోన్‌కలపండి!” అని జగన్ చెప్పి నట్టు తెలిసింది. అయితే.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని.. అందుబాటులో లేరని.. పార్టీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పుకొచ్చారు. ఇక, అప్పట్లో పదవులు పొందిన వారిలో ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ సహా 89 మందిని సలహాదారులగా నియమించారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే ప్రస్తుతం పార్టీకి అందుబాటులో ఉన్నారు.
మిగిలిన వారిలో ఎవరూ కూడా పార్టీకి, పార్టీ అధినేతకు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. అంతేకాదు.. ప్రస్తుతం పార్టీకి సలహాలు కావాలని కోరుతున్నా.. పార్టీ పుంజుకునేలా వ్యూహాలు రచించాలని పిలుపునిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం మారిన వెంటనే .. చాలా మంది మౌనం పాటించారు. మరికొందరు రాజకీయాలకు కూడా దూరమయ్యారు. వీరి జాబితా.. వారు తీసుకున్న జీత భత్యాలు పెద్దదే. అయినా.. ఇప్పుడు మాత్రం ఎవరూ కనిపించడం లేదు.
ఇదీ.. జగన్ అడిగిన జాబితా!
— జగన్ రాసిపెట్టే జీవీడీ కృష్ణమోహన్‌ను కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించారు.
— దేవులపల్లి అమర్‌ను జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియమించారు.
— సినీ నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుని చేశారు.
— శాననమండలిలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గంగుల ప్రభాకర్‌రెడ్డిని జలవనరులశాఖ సలహాదారుగా నియమించారు.
— మైనార్టీ సంక్షేమ శాఖకు జియావుద్దీన్, హబీవుల్లా, మహమ్మద్ అలీ బాగ్దాదీ, మద్దు బాలస్వామి అనే నలుగురు సలహాదారుల్ని నియమించింది.
— ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన చంద్రశేఖర్‌రెడ్డి.ని సలహాదారు ని చేశారు.
— ఆలూరు సాంబశివారెడ్డిని పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శిగా నియమించింది. కేబినెట్ ర్యాంక్‌తో విద్యాశాఖ సలహాదారుగా నియమించింది.
— వైసీపీ నాయకుడు చల్లా మధుసూదన్‌రెడ్డిని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సలహాదారుగా నియమించింది.
— పీటర్ టి.హసన్ అనే వ్యక్తిని ‘ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రమోషన్’ సలహాదారుగా, కృష్ణ జి.వి.గిరిని ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారుగా నియమించారు.
— ఆర్.వీరారెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు ఎస్. రాజీవ్ కృష్ణలకు సలహాదారు పదవులు కట్టబెట్టారు.
— మాజీ సీఎస్ నీలం సాహ్నీ పదవీ విరమణ చేసిన వెంటనే సలహాదారుగా నియమించారు.
— జగన్ హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ని కేబినెట్ హోదాతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
— ఎన్నారై సలహాదారుగా జుల్ఫీ రవ్‌ద్జీ అనే వ్యక్తిని నియమించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates