వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు సీఎం చంద్రబాబు సౌండ్ లేకుండా చేశారు. గుడ్ ఫ్రైడేను పురస్క రించుకుని క్రిస్టియన్లు ఘనంగా నిర్వహించుకునే.. గుడ్ ఫ్రైడే సందర్భంగా సర్కారుపై విమర్శలు గుప్పించేందుకు.. జగన్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ నాయకులను కూడా రెడీ చేశారు. తమ హయాంలో పాస్టర్లకు, మతాచార్యులకు నెల నెలా పింఛను రూపంలో గౌరవ వేతనం ఇచ్చామని.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. దానిని ఎత్తేశారని వారికి చెప్పాలని నిర్ణయించారు.
అయితే.. తాజాగా కూటమి సర్కారు ఈ విషయంలో జగన్‌కు భారీ షాక్ ఇచ్చింది. తాజాగా సర్కారు ఉత్త ర్వులు జారీ చేసింది. పాస్టర్లకు.. క్రిస్టియన్ మతాచార్యులకు.. రూ.5000 చొప్పున పింఛను, లేదా గౌరవ వేతనాన్ని పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు.. 2024కు ముందు.. వైసీపీ అమలు చేసిన దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్టు తెలిపింది. అక్కడితో కూడా ఆగకుండా.. గత ఏడాది మే నుంచి నవంబర్ వరకు లెక్కగట్టి.. సొమ్ములు ఇవ్వనున్నట్టు తెలిపింది.
అంటే.. సుమారు 7 మాసాల కాలానికి రూ.5000 చొప్పున శుక్రవారం(గుడ్ ఫ్రైడే) నాడు ఈ సొమ్మును ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒక్కొక్క పాస్టర్(లబ్ధిదారులైనవారు, ప్రభుత్వ జాబితాలో ఉన్నవారు) రూ.35 వేల చొప్పున అందుకోనున్నారు. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రూ.30 కోట్ల నిధులను కూడా విడుదల చేసినట్టు తెలిపింది. దీంతో జగన్ అండ్ టీమ్‌కు సౌండ్ లేకుండా పోయింది.
వాస్తవానికి వైసీపీ హయాంలో ప్రారంభమైన ఈ పథకాన్ని ఆపేయాలని కూటమి కుట్ర చేసిందంటూ.. ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయాలనిఅనుకున్న సమయంలో చంద్రబాబు సర్కారు ఊహించని విధంగా నిర్ణయం వెలువరించడంతో జగన్‌కు సౌండ్ లేకుండా పోయిందని కూటమి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.