నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. అది వారికే చీప్‌గా పరిణమించి.. సమాజంలో మరింత చులక న కావడం ఖాయం. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. పోలీసులను ఉద్దేశించి పదే పదే జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన హుందా తనాన్ని మరింత డౌన్ చేస్తున్నాయి. చివరకు.. ఒక స్టేషన్‌కు పరిమితమైన ఎస్సై స్థాయి అధికారులతోనే తిట్టించుకునే పరిస్థితి వచ్చింది.
నిజానికి మాజీ సీఎం అయినప్పటికీ.. సమాజంలో ఘనమైన గౌరవం ఉంటుంది. ఈ విషయంలో తేడాలే దు. నాడు చంద్రబాబు అయినా.. నేడు జగన్ అయినా.. అంతే. అయితే.. అది వారు అనుసరించే హుందా తనాన్ని బట్టి ఆధారపడుతుంది. సాధారణంగా.. ఇప్పుడున్న చట్టాల ప్రకారం.. ఆఫీసులో పనిచేసే ప్యూన్‌ను కూడా తిట్టడానికి వీల్లేదు. అలాంటిది పోలీసులపై అక్కసు ప్రదర్శించి.. చేస్తున్న జగన్ వ్యాఖ్యలు.. సరికాదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
వైసీపీలోనే కొందరు నాయకులు తాజాగా జగన్ చేసిన బట్టలూడదీస్తాం, యూనిఫాం విప్పిస్తాం , నిలబె డతాం వంటి పదాలను తప్పుబడుతున్నారు. అది ఆయన స్థాయికి తగదు
అని సీనియర్ నాయకులు గుట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. మనసులో ఎన్నైనా ఉండోచ్చు.. వాటిని ఇలా వ్యక్త పరచడం తప్పన్నది వైసీపీ నాయకులే చెబుతున్న మాట. ఇక, ఏదైనా పోలీసులు తప్పు చేస్తే.. న్యాయ స్థానాలు ఉన్నాయి. అక్కడ ప్రైవేటు కేసులు వేసుకునే అవకాశం, వెసులుబాటు రెండూ ఉన్నాయి.
దీనిని వదిలి పెట్టి.. వైసీపీ అధినేత ఇలా బరితెగించి చేస్తున్న వ్యాఖ్యలు.. పోలీసు వర్గాల్లో మరింత చులకన ఏర్పడేలా చేస్తున్నాయి. ఇప్పటి వరకు మాజీ సీఎంగా ఉన్న జగన్‌కు అంతో ఇంతో పోలీసులు గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు వారంతా ఏకమై.. సహాయ నిరాకణకు దిగితే.. ఏంటి పరిస్థితి? తాడేపల్లి దాటిబయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాబట్టి.. చీప్ రాజకీయాలు.. చీప్ వ్యాఖ్యలు చేస్తే.. నష్టపోయేది..పోలీసులు కాదు.. జగను, ఆయన పార్టీనేనని అంటున్నారు పరిశీలకులు.