కార్యకర్తే అధినేత కార్యక్రమం తెలుగు దేశం పార్టీలో పక్కాగా అమలు అవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి, ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సందర్బంగా ఆ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో చాలా మందిని పేరు పెట్టి పిలిచిన లోకేశ్…పార్టీకి అండాదండా అన్నీ కార్యకర్త లేనన్న విషయాన్ని మరోమారు ప్రస్తావించారు. వర్తమానంతో పాటుగా భవిష్యత్తులోనూ ఇదే పంథాతో ముందుకు సాగుదామంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో అతిపెద్ద జబ్బు ఉందని… అదే అలక అని పేర్కొన్న లోకేశ్..దానికి ఫుల్ స్టాప్ పెడదామన్నారు. అలకను వదిలించుకుందామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పార్టీలో ఉన్న అలకలను ప్రస్తావిస్తున్న సమయంలో లోకేశ్… పార్టీని ఓ కుటుంబంగా అభివర్ణిస్తూ చేసిన పోలిక అందరినీ ఆకట్టుకుంది. నలుగురు ఐదుగురు సభ్యులున్న చిన్న కుటుంబాల్లోనే చిన్నచిన్నసమస్యలు ఉంటున్నాయని చెప్పిన లోకేశ్… కుటుంబాల్లో సభ్యుల సంఖ్య పెగితే కొద్దీ అభిప్రాయ బేధాలు కూడా పెరుగుతాయని చెప్పారు. అలాంటి కోటి మంది సభ్యత్వాలు కలిగిన టీడీపీ… ఓ అతిపెద్ద కుటుంబమని ఆయన అన్నారు. అంతపెద్ద కుటుంబంలో అభిప్రాయ బేధాలు, అలకలు సర్వసాధారణమన్నారు. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ సాగుతామని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తాను ఎలాంటి బేషజాలకు వెళ్లనని… పార్టీ శ్రేణులు కూడా అలాగే పయనిస్తే అసలు సమస్యలే ఉండవని కూడా లోకేశ్ అభిప్రాయపడ్దారు.
పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే బీమా సౌకర్యాన్ని అందిస్తున్నామన్న లోకేశ్… ఇటీవలే పార్టీ సభ్యుల సంఖ్య కోటి మార్కు ను దాటడం తనను ఎంతగానో సంతోషానికి గురి చేసిందన్నారు. ఇంతటి సంఖ్యలో సభ్యులను కలిగిన పార్టీగా దేశంలో టీడీపీ ఓ రికార్డును సృష్టించిందని తెలిపారు. పార్టీ కార్యకర్లకు బీమాతో పాటుగా స్వయం ఉపాధి కూడా చూపించాలని అనుకుంటున్నామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే కొంతమేర చర్యలు చేపట్టినట్లు కూడా ఆయన తెలిపారు. ఈ చర్య లను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా జిల్లాల పార్టీ బాధ్యులు, ఇంచార్జీ మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పార్టీ నియమావళిని పార్టీ శ్రేణులు నిక్కచ్చిగా పాటించాలని, అదే సమయంలో ఏ సమస్య ఉన్నా… జిల్లాలకు వస్తున్న పార్టీ కీలక నేతలను సంప్రదించి వాటిని ఆదిలోనే పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates