2 వేల కోట్ల‌తో వారి క‌న్నీరు తుడిచిన చంద్ర‌బాబు!

వారంతా చిన్న చిత‌కా కాంట్రాక్ట‌ర్లు. చిన్న‌పాటి ప‌నులు చేసుకుని త‌మ జీవితాలను, త‌మ‌పై ఆధార‌ప‌డిన కూలీల జీవితాల‌ను న‌డిపిస్తున్నారు. వీరంతా ప్ర‌భుత్వంపైనే ఆధార‌ప‌డ్డారు. అయితే.. వైసీపీ హ‌యాంలో చేసిన ప‌నుల‌కు అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. వీరిని క‌నిక‌రించ‌లేదు. వారు ప‌నులు పూర్తి చేసినా.. బిల్లులు తొక్కి పెట్టారు. క‌నీసం చేసిన ప‌నుల‌కు కూడా బిల్లులు ఇవ్వ‌లే దు. చివ‌రు చిన్న స్థాయి కాంట్రాక్ట‌ర్లు.. కూట‌మి క‌ట్టి.. హైకోర్టుకువెళ్లారు. దీంతో హైకోర్టు సొమ్ములు చెల్లించాల‌ని ఆదేశించింది. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ స‌ర్కారు క‌నిక‌రించ‌క‌పోగా..ఎద‌రు నాణ్య‌త లేద‌ని కేసులు పెట్టించింది.

ఇలా.. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా 17 వేల మందికి పైగా కాంట్రాక్ట‌ర్లు చిక్కుల్లో ప‌డ్డారు. ఇంత‌లో స‌ర్కారు మారింది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. దీంతో వీరంతా .. ప్ర‌భుత్వానికి ప‌లు రూపాల్లో మొర‌వినిపించారు. ఈ నేప‌థ్యంలో ఆయా కాంట్రాక్ట‌ర్ల ప‌నితీరుపై అధ్య‌య‌నం చేయించిన సర్కారు.. కాంట్రాక్ట‌ర్లు చేసిన ప‌నుల‌పై ఆడిట్ నిర్వ‌హించి.. వారు చేసిన ప‌నుల‌పై రికార్డులు తెప్పించుకుంది. వారంతా స‌వ్యంగానే ప‌నులు చేశార‌ని.. ఎక్క‌డా అవినీతి అక్ర‌మాలు లేవ‌ని.. నిర్ధారించుకుంది. దీంతో స‌ద‌రు 17 వేల మందికిపైగా చిన్న త‌ర‌హా కాంట్రాక్ట‌ర్ల‌కు ఉగాది ని పుర‌స్క‌రించుకుని శుభవార్త చెప్పింది.

ఆదివారం రాత్రి పొద్దు పోయిన త‌ర్వాత‌.. 17 వేల మందికి వైసీపీ హ‌యాంలో రెండుమూడేళ్లుగా పెండింగులో పెట్టిన సుమారు రూ2 వేల కోట్ల కు పైగా మొత్తాన్ని విడుద‌ల చేసేందుకు అంగీకరించింది. ఈ మొత్తాల‌ను వెనువెంట‌నే అంటే.. సోమ‌వారం నుంచే ప్రాధాన్యం బేస్ చేసుకుని చెల్లించాల‌ని ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌కు సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. దీంతో ఆదివారం రాత్రంతా ప‌య్యావుల కేశ‌వ్ ఇదే ప‌నిపై రాజ‌ధానిలో ఉండిపోయారు. సోమ‌వారం బ్యాంకులు తీసే స‌మ‌యానికి క‌నీసం స‌గం మందికైనా చెల్లింపులు ప్రారంభం కావాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు.

ఇక‌, ప్ర‌భుత్వం తీసుకున్న యుద్ధ‌ప్రాతిప‌దిక నిర్ణ‌యంప‌ట్ల‌ చిన్న‌త‌ర‌హా కాంట్రాక్ట‌ర్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు త‌మ క‌న్నీరు తుడిచార‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి పేరుకుపోయిన బిల్లులు ఇక రావేమోన‌ని భావించామ‌ని.. కానీ, చంద్ర‌బాబు విడుద‌ల‌కు ప‌చ్చ‌జెండా ఊపార‌ని తెలిపారు. అంతేకాదు.. రాజకీయ క‌క్ష‌లు ఎక్క‌డా చూపించ‌లేద‌ని ప‌లువు రు మీడియాతో వ్యాఖ్యానించారు. తాము అప్పులు చేసి మ‌రీ ప‌నులు చేప‌ట్టామ‌ని.. అయినా.. కూడా వైసీపీ ప్ర‌భుత్వం క‌నిక‌రించ‌లేద‌ని అన్నారు.