కేడర్ కష్టంలో ఉంటే యరపతినేని ఆగలేరు!

రాజకీయాల్లో కొన్ని ప్రాంతాల పేరు విన్నంతనే…కొన్ని పార్టీల పేర్లు, కొందరు రాజకీయ నేతల పేర్లు ఠక్కున గుర్తుకు వస్తాయి. ఆ ప్రాంతాల్లో ఆ పార్టీలే కాకుండా ఇతరత్రా పార్టీలు, నేతలు కూడా విజయం సాధించి ఉండవచ్చు. అయినా కూడా ఆ ప్రాంతాల పేర్లు వినిపించినంతనే… ఆ ఒక్క పార్టీ, ఆ ఒక్క నేత పేరే జనం మదిలో మెదులుతాయి. అలాంటి ప్రాంతమే గురజాల. పల్నాడు జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గం పేరు విన్నంతనే… టీడీపీ పేరు, యరపతినేని శ్రీనివాసరావు పేర్లు ఠక్కున స్ఫురిస్తాయి. గురజాల టీడీపికి కంచుకోట కిందే లెక్క. గురజాల అంటేనే యరపతినేని అడ్డా అన్న మాట రీసౌండ్ ఇచ్చేస్తుంది.

ఇలా గురజాల పేరు విన్నంతనే టీడీపీ, యరపతినేని పేర్లే ఎందుకు వినిపిస్తాయంటే… అదంతే. అక్కడి కేడర్ పార్టీని వీడి వెళ్లరు. యరపతినేనిని అస్సలు వీడి ఉండలేరు. ఏళ్ల తరబడి ఇదే జరుగుతోంది. 30 ఏళ్ల క్రితం యరపతినేని పాలిటిక్స్ లోకి వస్తే.. 10 ఏళ్లు కాంగ్రెస్, 5 ఏళ్లు వైసీపీ నేతలు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయినా కూడా గురజాల అంటేనే యరపతినేని తప్పించి వేరే నేత పేరే వినిపించదు. గురజాల ప్రజల్లోకి ఆయన చొచ్చుకు వెళ్లిపోయారు. యరపతినేనిని వారంతా తమ వాడిగా భావిస్తారు. టీడీపీ కేడర్ అయితే మరింతగా ఆయనను ఓన్ చేసుకుంటారు. ఇందుకు కారణం.. పార్టీ కేడర్ ను యరపతినేని కూడా సొంతింటి వారుగానే చూస్తారు. కార్యకర్తకు కష్టం వచ్చిందంటే… యరపతినేని అక్కడ ప్రత్యక్షమవుతారు. ఇంకా చెప్పాలంటే… కార్యకర్తకు కష్టం వచ్చిందంటే… యరపతినేని ఆగలేరు.

ఈ మాట నిజమేనన్నట్లుగా ఇటీవలే ఓ ఘటన జరిగింది. గురజాల పట్టణం 13వ వార్డుకు చెందిన షేక్ సుభాని ఏళ్ల తరబడి టీడీపీ కార్యకర్తగా కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ మరణంపై సమాచారం అందుకున్న యరపతినేని తన కుమారుడు నిఖిల్ ను వేంటేసుకుని సుభానీ కుబుంబాన్నిపరామర్శించారు. ఈ సందర్భంగా సుభానీ ఫ్యామిలీ ఎంత కష్టంలో ఉందో యరపతినేని గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుభానీ తన ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారట. అది తీర్చకుండానే ఆయన చనిపోయారు. ఇది తెలుసుకుని యరపతినేని చలించిపోయారు. ఇంకేం ఆలోచించకుండా..సుభానీ చేసిన అప్పు రూ.3 లక్షలను తాను చెల్లించి సదరు ఇంటిని తాకట్టు నుంచి విడిపించారు. తన ఫ్యామిలీ పట్ల యరపతినేని చూపించిన ప్రేమకు సుభానీ సతీమణి ఫాతిమా కృతజ్ఞతలు తెలిపారు.