భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సదస్సులో ఆయన ఉద్వేగ పూరిత ప్రసంగం చేశా రు. తొలుత పవన్ కల్యాణ్.. తన ప్రసంగాన్ని తమిళ భాషలోనే ప్రారంభించారు. అనంతరం.. దేశంలోని పలు రాష్ట్రాల భాషలను కూడా స్పృశించారు. జాతీయ భాషగా పేర్కొనే హిందీ మొదలు.. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ దాకా.. పలు భాషల్లో మాట్లాడారు.
తనకు మహారాష్ట్ర సహా తమిళనాడు, కర్ణాటకలోనూ.. తనకు అభిమానులు ఉన్నారని తెలిపారు. అయితే.. భాష ఏదైనా భావం ఒక్కటే కీలకమని.. వ్యాఖ్యానించారు. బహుభాషే దేశానికి కీలకమని వ్యాఖ్యానించారు. ఇది దేశానికి జీవనాడి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు భాషలు మాట్లాడి వినిపించారు. తమిళనా డు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని సూచించారు. అదేవిధంగా తన మాట వినాలని.. పదే పదే.. జనసేన అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులను ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఓజీ ఓజీ అంటూ వ్యాఖ్యలు చేసిన వారిని విమర్శించారు. తను చెప్పిన మాట విన్నందు వల్లే.. ఒక పార్టీ 151 స్థానాల నుంచి 11కు పడిపోయిందన్నారు. ఇప్పుడు కూడా తన మాట వినాలని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రస్తుతం 11వ ఆవిర్భావదినోత్సవాన్ని పూర్తి చేసుకున్నా మని.. అదేసమయంలో ఆ పార్టీని(వైసీపీ) 11 స్థానాలకు పరిమితం చేశామని వ్యాఖ్యానించారు. ఓటమి భయం లేదు కాబట్టే.. 2024లో పుంజుకున్నామని చెప్పారు.