ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం విశేషం. అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. అయితే, సభలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతున్నారు. తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఆ తర్వాత శాసన సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తి కాకుండానే బహిష్కరించి జగన్ తో పాటు వైసీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు జగన్ వస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రజా సమస్యల సంగతి పక్కనబెడితే కనీసం రాష్ట్ర గవర్నర్ ప్రసంగం వినే ఓపిక, సహనం వైసీపీ సభ్యులకు లేవని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి నేతలు రేపు బడ్జెట్ సమావేశాలకు మాత్రం హాజరవుతారా..లేదంటే సస్పెన్షన్ వేటు తప్పించుకోవడం కోసం ఈ రోజు మాదిరి హాజరు వేసి వెళతారా అన్నది తేలాల్సి ఉంది. ఇక, ఈ ఒక్క రోజు హాజరు పడింది కాబట్టి మరో 60 రోజుల పాటు జగన్ అండ్ కో కు అసెంబ్లీ నుంచి డుమ్మా కొట్టే చాన్స్ వచ్చిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిన జగన్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates