Political News

ఫేక్‌-రియ‌ల్‌ : ఒరిజినల్ వీడియోతో జ‌గ‌న్‌కు లోకేష్ కౌంటర్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. జైల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీని ప‌రామ‌ర్శించారు. గ‌న్న‌వ‌రంలోని టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిపై కేసు పెట్టి స‌త్య‌వ‌ర్థ‌న్ అనే వ్య‌క్తిని బెదిరించి, కిడ్నాప్ చేసి.. కేసును వెన‌క్కి తీసుకునేలా చేశార‌న్న అభియోగంపై ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రిమాండ్ ఖైదీగా విజ‌య‌వాడ జైల్లో వంశీ ఉన్నారు. వంశీని ప‌రామ‌ర్శించిన అనంత‌రం.. జ‌గ‌న్ మాట్లాడుతూ.. అస‌లు ఆ టీడీపీ కార్యాల‌యం కేసుకు, వంశీకి సంబందం లేద‌ని చెప్పారు. అంతేకాదు.. టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి రాం రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే.. ఆ దాడి జ‌రిగింద‌న్నారు.

ఈ వ్య‌వ‌హారంలో వైసీపీ నాయ‌కుల ప్ర‌మేయం అస‌లు లేనేలేద‌ని జ‌గ‌న్ చెప్పారు. అయితే.. జ‌గ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ గా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. `ఫేక్‌-రియ‌ల్‌` అంటూ.. ఓ వీడియోను విడుద‌ల చేశారు. దీనిలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు.. దాని ప‌క్క‌నే టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడి.. నాడు వాహ‌నాలు త‌గ‌ల బ‌డుతున్న దృశ్యాల‌ను పేర్కొన్నారు. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు.. జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఏమాత్రం పొంతన లేద‌ని నారా లోకేష్ సాక్ష్యాధారాల‌తో స‌హా వివ‌రించారు.

“నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు `మీ బ్రాండ్` జగన్ రెడ్డి గారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది“ అని నారా లోకేష్ నిప్పులు చెరిగారు.

This post was last modified on February 18, 2025 9:10 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

27 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

3 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

6 hours ago