అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, కాబట్టి సమావేశాలకు తాను హాజరు కావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల మీడియా సమావేశం పెట్టిన జగన్..
మీడియా ముందు మాట్లాడినంత సమయం తనకు అసెంబ్లీలో కూడా కావాలని…అలా సమయం ఇవ్వడం లేదు కాబట్టే సభకు వెళ్లడం లేదని తేల్చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
సభలోని మొత్తం స్థానాలలో 10 శాతం..అంటే ఏపీ అసెంబ్లీ ప్రకారం కనీసం 18 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తేల్చి చెప్పేశారు. జగన్ లీవ్ లెటర్ ఇవ్వలేదని, వరుసగా 60 రోజుల పాటు అనుమతి లేకుండా శాసన సభకు డుమ్మా కొడితేఆ సభ్యుడి సభ్యత్వం రద్దవుతుందని రాజ్యాంగంలో ఆర్టికల్ 190/4 లో స్పష్టంగా రాసుందని రఘురామ అన్నారు.
రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సభాపతి, ఉప సభాపతిపై ఉందని, చట్ట ప్రకారం తాము నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అయితే, 60 రోజులు దాటిన తర్వాత కూడా సెలవులు కావాల్సి వస్తే సెలవు పొడిగింపు కోరుతూ మరో లెటర్ ఇవ్వాలని అన్నారు. కానీ,జగన్ అసలు ఒక్క లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదని చెప్పారు.
అయితే, ఇదే విషయంపై జగన్ ను ఓ విలేఖరి ప్రశ్నించగా..ఏం చేసుకుంటారో చేసుకోనీయబ్బా…అని జగన్ తనదైన శైలిలో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని రఘురామ గుర్తు చేశారు. జగన్ కు లీవ్ పెట్టే ఉద్దేశ్యం ఉందో లేదో తనకు తెలీదని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates