రీజనబుల్ టైం అంటే ఎంతకాలం.. ?

రీజనబుల్ టైం అంటే.. ఎంతకాలం? ఈ ప్రశ్న వేసింది సామాన్య వ్యక్తులు కాదు. సామాన్య సంస్థలు కూడా కాదు. సాక్షాతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నుంచి ఈ ప్రశ్న వినిపించింది. ఈ ప్రశ్న తెలంగాణకు చెందిన ఓ పిటీషన్ విచారణ సందర్బంగా వినిపించడం గమనార్హం. ఈ ప్రశ్నకు నీళ్లు నమిలిన ప్రాసిక్యూషన్ లాయర్ ఫై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి సమాధానాలను అనుమతించబోమని కూడా కోర్టు ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేసింది. అనంతరం ఈ పిటీషన్ ఫై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఆ విధారణ సందర్బంగా రీజనబుల్ టైం అనే పదం వినిపించదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ కథాకమామీషు ఏమిటన్న విషయంలోకి వెళితే.. తెలంగాణాలో 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ గుర్తు ఫై పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచినా 10 మంది ఆ తర్వాత అధికార కాంగ్రెస్ లో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ లపై సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి విచారణ జరిపారు. ఈ సందర్బంగా రీజనబుల్ టైం లోగ చర్యలు తీసుకుంటామని స్పీకర్ కార్యాలయం చెప్పిందని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సమాధానం వినిపించినంతనే న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రీజలబుల్ టైం అంటే ఎంత సమయం అని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. రీజనబుల్ టైం అంటే 10 నెలలు కాదని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఈ అంశంపై జరిగిన విచారణ అందర్బంగా కూడా కోర్టు ప్రభుత్వ న్యాయవాది వాదనపై ఆగ్రాహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా సోమవారం నాటి విచారణ సందర్బంగా కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది నుంచి అదే తరహా సమాధానం రావడంతో కోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేయక తప్పలేదు. అయితే… ఇకపై ఇలాంటి సమాధానాలను అనుమతించబోమని… ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. అనంతరం ఈ పిటీషన్ ఫై తదుపరి విచారణను ఈ నెల ౧౮కి వాయిదా వేసింది.