వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 2.0పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జగన్ 2.0 చాలా భి న్నంగా ఉంటుందని.. కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తామని ఆయన ప్రకటించారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో జగన్ 2.0పై వైసీపీలో చర్చ ప్రారంభమైంది. ఇది నమ్మ శక్యంగా లేదనికొందరు అప్పుడే పెదవివిరుస్తుండగా.. మరికొందరు నాయకులు మాత్రం 2.0 బాగానే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఎన్నికల్లో కార్యకర్తలను విస్మరించారన్న అపప్రద జగన్‌పై ఉంది. కేవలం వలంటీర్లను మాత్రమే నమ్ముకుని.. కార్యకర్తలను పక్కన పెట్టారన్న చర్చసాగింది. ఇది పార్టీని భారీ పతనానికి చేర్చిందన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు కార్యకర్తలకు అసలు సిసలు పరీక్ష ఎదురు కానుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. అప్పుడు కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కుతుంది.
అంటే.. వచ్చే నాలుగేళ్లపాటు పార్టీ కార్యకర్తలు పనిచేయాల్సి ఉంటుంది. కూటమి సర్కారుకు వ్యతిరేకం గా పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ, ఇది సాధ్యం కాకపొవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం వైసీపీ తరఫున గళం వినిపించేవారే లేకుండా పోయినదరిమిలా.. పార్టీని కాపాడు కునేందుకు జగన్ వేసిన ఎత్తుగడగా కొందరు భావిస్తున్నారు. ఇక్కడ కీలక విషయం పార్టీ కార్యకర్తలు.. కేసులు పెట్టించుకునేందుకు సిద్ధంగా అయితే లేరు. ఇప్పటికే జైళ్లలో ఉన్నవారికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు.
ఇక, ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టించుకుంటే.. ఆ పరిస్థితి మరో రేంజ్‌లో ఉంటుంది. ఇక, జగన్ 2.0 భి న్నంగా ఉంటుందని చెప్పడం వెనుక.. ప్రస్తుతం ఉన్న నాయకులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా రన్నది మరో టాక్. కీలక నేతలు ఇప్పటికే పార్టీ మారిన దరిమిలా.. మున్ముందు.. ఎవరూ వెళ్లకుండా చేసే ప్రక్రియలో ఇది పరాకాష్టగా పేర్కొంటున్నారు. ఎలా చూసుకున్నా.. వచ్చే నాలుగేళ్లు మాత్రం వైసీపీకి పోరాటాలు తప్ప.. ఆరాటం పనిచేసే అవకాశం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వైసీపీ అధినేత కార్యకర్తలను మచ్చిక చేసుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు.