సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు ముందు చాలా మంది వివాదాస్పద దర్శకుడు అంటూ రాస్తూ ఉంటారు. తన పనేదో తానూ చేసుకుపోతున్న వర్మను ఇలా వివాదాస్పద దర్శకుడు అని రాయాల్సిన అవసరం ఏముందని అడిగే వారికి ఇప్పుడు సిసలైన సమాధానం దొరికిందని చెప్పాలి. అసలే పోలీసులు… ఆపై విచారణ పేరిట నోటీసుల మీద నోటీసులు. వాటికి స్పందించాలంటేనే వణికిపోయిన వర్మ.. ఆ విదారణకు ఒక్కసారి హాజరు కాగానే.. తనలోని భయం మొత్తం పోయినట్టే ఉంది. అందుకే కాబోలు విచారణ ముగిసిన వెంటనే… వర్మ మందు గ్లాస్ చేతిలో పెట్టుకుని మరీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి పోలీసులపైనే పోస్టులు పెట్టారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా… వాటిని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకర కామెంట్లు పెట్టిన కేసులో గత శుక్రవారం వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట విదారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పోలీసులు ఏకంగా 9 గంటల పాటు వర్మను విచారించారు. పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వర్మా.. సుదీర్ఘ విచారణ తర్వాత బతుకు జీవుడా అంటూ బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా వైసీపీ నేతల వద్దకు వెళ్లిన వర్మ… ఆ రాత్రి ఒంగోలు లోనే ఉన్నట్టు సమాచారం. ఈ సందర్బంగా వర్మ ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టే ఉన్నారు.
సరే.. తన డబ్బు..తన ఎంజాయ్… ఎవరికీ ఏమీ ఇబ్బంది లేదు గాని… చేతిలో మందు గ్లాస్ పట్టుకుని… ఓ సెల్ఫీ తీసుకుని… దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి…దానికి ఓ కామెంట్ కూడా పెట్టారు. ”ఐ లవ్ ఒంగోలు.. అండ్ ఐ లవ్ ఒంగోలు పోలీస్ ఈవెన్ మోర్.. త్రీ చీర్స్” అంటూ వర్మ సదరు కామెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలే పోలీసు విచారణ అంటే ముందస్తు బెయిల్ వచ్చే దాకా హడలిపోయిన వర్మ,… ఇలా విచారణ ముగిసిందో, లేదో పోలీసులనే కామెంట్ చేస్తూ పోస్టు పెట్టడం గమనార్హం. అసలు వర్మ పెట్టిన ఈ పోస్టును ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 9, 2025 11:22 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…