వచ్చి రెండు దశాబ్దాలవుతున్నా మన్మథుడుకుండే క్రేజ్ వేరే. అందుకే రీ రిలీజ్ టైంలో ఇది మసాలా సినిమా కాకపోయినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మరీ ఎంజాయ్ చేశారు. విజయ్ భాస్కర్ దర్శకత్వం, త్రివిక్రమ్ మాటలు మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఇందులో మెయిన్ హీరోయిన్ సోనాలి బెంద్రేనే అయినా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అన్షు చాలా కీలకం. నాగార్జునని ప్రేమించి యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయే క్యారెక్టర్ లో కనిపించే కాసేపు రెండు పాటల్లో అలా గుర్తుండిపోయింది. తర్వాత ప్రభాస్ రాఘవేంద్రలో నటించింది కానీ అది డిజాస్టర్ అయ్యాక భూమిక మిస్సమ్మలో క్యామియో తప్ప మళ్ళీ ఎక్కడ కనిపించలేదు.
ఇప్పుడు మజాకాతో అన్షు రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇన్ని సంవత్సరాలు ఏమైందనే ప్రశ్నకు సమాధానాలు చెబుతోంది. అన్షు సినిమాలు చేసే నాటికీ ఆమె వయసు 16 ఏళ్ళు. చదువు మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చిన ఆఫర్లు వదులుకుని లండన్ వెళ్ళిపోయింది. సైకాలజీలో మాస్టర్ చేసింది. పాతికేళ్లకే పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. ఏదైనా ఏజెన్సీలో పని చేద్దామని ప్రయత్నిస్తే అన్షు నటించిన సినిమాలు తమకు తెలియవని చెప్పి తిరస్కరించారు. తిరిగి ఇంత కాలం తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన మజాకాని రెండు గంటలసేపు నెరేట్ చేశాక అవకాశాన్ని వదులుకోవాలి అనిపించలేదు.
మన్మథుడు కోసం పదమూడు రోజులు కాల్ షీట్స్ ఇచ్చిన అన్షు మజాకాకు రెండు నెలలు కేటాయించింది. రావు రమేష్ ప్రేమించే మధ్య వయసు మహిళగా కొత్త తరహా పాత్రలో కనిపించనుంది. ఇంత వయసు వచ్చినా అదే అందంతో తొణికిసలాడుతున్న అన్షు ఇకపై కెరీర్ కొనసాగిస్తానని చెబుతోంది. సెట్స్ లో అడుగుపెట్టినప్పుడు ఒత్తిడిగా అనిపించిందని ఇప్పుడది తగ్గిపోయిందని చెబుతున్న అన్షుకి ఇది హిట్ కావడం కీలకం. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ ఎంటర్ టైనర్ ఫిబ్రవరి 26 శివరాత్రి సందర్భంగా రిలీజవుతోంది. నవ్వించడమే లక్ష్యంగా ధమాకాని మించిన ఎంటర్ టైన్మెంట్ త్రినాథరావు ఇందులో పొందుపరిచారట.
This post was last modified on February 9, 2025 11:36 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…