ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది అన్నిరాష్ట్రాల్లోనూ శాస‌న స‌భ ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ప్ర‌త్యేకంగా స్పీక‌ర్‌, స‌భానాయ‌కు డు(సీఎం), శాస‌న స‌భ కార్య‌ద‌ర్శి స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకుంటారు. వీటికి ఉన్న ప్రాధాన్యం రీత్యా.. ఆయా ప‌ద‌వుల చైర్మ‌న్‌ల‌ను ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షానికి కేటాయిస్తారు. ఎందుకంటే.. స‌ర్కారు చేసే ఖ‌ర్చును సొంత పార్టీ నేత‌లే.. స‌మీక్షిస్తే అనుకూలంగా వారు నివేదిక‌లు ఇచ్చే అవ‌కాశంఉన్నందున ప్ర‌తిప‌క్ష నేత ఎంపిక చేసిన వారికి ప్ర‌భుత్వం ప‌క్షాన ఆ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారు.

వీటి ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ, ప్ర‌బుత్వ రంగ సంస్థ‌ల క‌మిటీ, మ‌రో ముఖ్య‌మైన అంచ‌నాల క‌మిటీ. ఈ మూడు కూడా.. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుకైనా కొల‌మానంగా ఉంటాయి. ఆయా క‌మిటీల‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎంపిక చేసిన వారిని చైర్మ‌న్‌లుగా నియ‌మించి.. దానిలో స‌భ్యులు అధికార‌, విప‌క్షాల‌కు చెందిన వారిని, అదేవిధంగా ఉన్న‌తాధికారిని కూడా నియ‌మిస్తారు. తాజాగా ఈ మూడు క‌మిటీల‌ను ఏపీ శాస‌న స‌భ ఏర్పాటు చేసింది. అయితే.. ప్ర‌తిప‌క్షం వైసీపీకి ‘ప్ర‌ధాన’ ప్ర‌తిప‌క్షం హోదా లేకపోవ‌డంతో వైసీపీ ఈ ప‌ద‌వుల‌ను కోల్పోయింది.

వాస్త‌వానికి ఏమాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఉన్నా.. రాజ్యాంగం ప్ర‌కారం.. శాస‌న స‌భ నియ‌మాల ప్ర‌కారం.. ఈ ప‌ద‌వుల‌ను వైసీపీకి ఇవ్వాల్సి ఉంది. కానీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి ఉన్న సంఖ్య‌లో సీట్లు రాక‌పోవ‌డంతో వైసీపీ వీటిని కోల్పోయింది. దీంతో కూట‌మి పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌ను ఆయా క‌మిటీల‌కు.. చైర్మ‌న్‌లుగా ఎంపిక చేస్తూ. ఏపీ శాస‌న స‌భ కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ చైర్మ‌న్‌గా జ‌న‌సేన నాయ‌కుడు, ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు ఎంపిక‌య్యారు. ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చుల‌ను, వ్య‌యాల‌ను ఈ క‌మిటీ ప‌రిశీలిస్తుంది.

అదేవిధంగా ప్ర‌బుత్వ రంగం సంస్థ క‌మిటీ చై్ర్మ‌న్‌గా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆముదాల వ‌ల‌స ఎమ్మెల్యే కూన ర‌వికుమార్ ను ఎంపిక చేశారు. ఈ క‌మిటీ.. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ప‌నితీరును అంచ‌నావేయ‌డంతోపాటు.. ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంది. త‌ద్వారా.. ఆయా సంస్థ‌లు నిల‌దొక్కుకునేందుకు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తుంది. ఇక‌, మూడోది.. అంచ‌నాల క‌మిటీ. దీనికి టీడీపీ నేత‌, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావును ఎంపిక చేశారు. సో.. మొత్తంగా ఈ మూడు కీల‌క క‌మిటీల చైర్మ‌న్‌ల‌ను వైసీపీ కోల్పోయింది.